మహేష్ బాబు ఇంట స్పెషల్ గా దీపావళి సెలబ్రేషన్స్, మరింత స్పెషల్ గా సితార పాప..
సాధారణంగా సెలబ్రిటీ లు పండగ చేసుకుంటే.. అది ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రత్యేకంగానే చేసుకుంటారు కూడా.. మరీముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో పండగ అంటే.. అదరిపోయేలా సెలబ్రేట్ చేస్తుంటారు. దివాళి కూడా అలానేసెలబ్రేట్ చేస్తున్నారు మహేష్ ప్యామిలీ.

మహేష్ బాబు ఇంట ప్రతీ పండగనుఘనంగ సెలబ్రేట్ చేస్తుంటారు. మరి ముఖ్యంగాసూపర్ స్టార్ పిల్లలిద్దరు ప్రతీ పండగనుప్రత్యేకంగా చేస్తుంటారు. ఆమధ్య వినాయక చవితిని కూడాఎంత ఘనంగాసెలబ్రేట్ చేశారోచూశాం. దసరాకు కూడా మహేష్ బాబు కూతురు సితార ప్రత్యేకంగా కనిపించింది. మహేష్ ఫ్యామిలీ నుంచి సితార కొంతకాలంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది.
స్టార్ కిడ్ అయినా.. తనకంటూ ఓన్ ఇమేజ్ తెచ్చుకునేప్రయత్నం చేస్తోంది సితార పాప. చిన్న ఏజ్ లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. మహేష్ ను మించి స్టార్ డమ్ సాధించేలా దూసుకుపోతోంది సితార పాట. రీసెంట్ గా ఓ యాడ్ ఫిల్మ్ లో కూడా నటించి మెప్పించింది. ఇకసమాజ సేవలో కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని.. ఆయన బాటలోనే నడుస్తోంది సితార. చదువుతో పాటు.. అన్నియాక్టివిటీస్ ను కొనసాగిసతూ.. తాను స్పెషల్అనిపించుకుంటుంది సితార.
ఇర పండగొస్తే చాలు సితార డ్రెస్సింగ్,ఆమె విధానం అద్భుతంగా ఉంటుంది. అచ్చ తెలుగింటి కుందనపు బొమ్మలా.. పద్దతిగా రెడీ అయి పూజలు చేసి, ఫోటోలు అభిమానులతో శేర్ చేసుకుంటుంది. తాజాగా దీపావళి సందర్భంగా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసింది. తన ఇంట్లో పనిచేసే వాళ్ళతో కలిసి సితార ముగ్గులు వేసింది. సితార ముగ్గులు వేస్తున్న ఫోటోలని, తాను వేసిన ముగ్గుని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అలాగే గాగ్రా చోళీ డ్రెస్ లో దీపం పట్టుకొని దీపావళికి స్పెషల్ ఫోటోలు కూడా ముందే పోస్ట్ చేసింది సితార. ఇక రాత్రికి దీపావళి సెలెబ్రేట్ చేసుకునే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తుందని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అభిమానులు, ఫాలోవర్లు కామెంట్స్ లో సితార పాపకి హ్యాపీ దీపావళి చెప్తున్నారు.