స్టూడెంట్స్ కు ‘సార్’ బంపర్ ఆఫర్... ఇలా చేస్తే ఫ్రీగా సినిమా చూడొచ్చంటూ నిర్మాత ప్రకటన!

విద్యావ్యవస్థను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన ‘సార్’ చిత్రం మేకర్స్ స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్ అందించారు. విద్యార్థులకు ఉచితంగా సినిమా చూపిస్తామంటూ తాజాగా నిర్మాత అనౌన్స్ చేశారు. 
 

SiR movie show at free of Cost to the school Students

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సార్’ SiR. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో Vaathiగా  విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా విద్యావ్యవస్థలోని లోపాలు, హక్కులు, స్టూడెంట్స్ కు సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించడం విశేషం. దీంతో సినిమా స్టూడెంట్స్ కు ఉపయోగపడేదిగా పబ్లిక్ లో టాక్ పెరిగిపోయింది.

దీంతో నిర్మాత నాగవంశీ (Naga Vamsi) కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ‘సార్’ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ట్వీటర్ ద్వారా తానే స్వయంగా ప్రకటించారు.  ట్వీట్ లో.. ‘చదువు విలువను అందరికీ తెలియజేయడమే సార్ మూవీ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం స్కూల్ విద్యార్థులకు సినిమాను ఉచితంగా చూపించబోతున్నాం. ఇందుకు సంతోషంగా ఉంది. అయితే సినిమాను ఉచితంగా చూసేందుకు విద్యార్థులు Contact@sitharaents.comకు మెయిల్ చేయాలి. మా టీమ్ ను వారిని సంప్రదించి త్వరలో ఓ షోను ప్రదర్శిస్తాం.’ అని పేర్కొన్నారు. 

హిట్ సినిమాలను నిర్మిస్తూ వస్తున్న ‘సితారా ఎంటర్ టైన్ మెంట్స్’బ్యానర్లో ఇలాంటి మంచి సినిమా రావడం పట్ల అభిమానులు, ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కూడా సామాజిక బాధ్యతను చూపించడం విశేషంగా మారింది. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ‘సార్’ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. తాజాగా రూ.100 కోట్ల క్లబ్ లోనూ చేరింది. హీరోయిన్ గా సంయుక్తా మీనన్ నటించింది. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఇక ధనుష్ ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయబోతున్నారు. త్వరలో అప్డేట్స్ అందనున్నాయి. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios