Dhanush Sir Movie : ‘సార్ ’ మూవీ షూటింగ్ ఆపేసిన ధనుష్.. కారణం అదేనా..?

ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో.. అలా ఆగిపోయింది తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) మూవీ షూటింగ్. అది కూడా హీరో ధనుష్ వల్లే షూటింగ్ ఆగిపోయినట్టు సమాచారం. ఇంతకీ ఏమయ్యింది.

Sir Movie Shooting Stopped duo To Corona

తమిళంలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ధనుష్(Dhanush). సూపర్ స్టార్ రజనీ కాంత్ అల్లుడిగా కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్న కోలీవుడ్ స్టార్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నాడు. ఇక్కడి నుంచి అయితు పాన్ ఇండియాకు ఈజీగా వెళ్లిపోవచ్చు అని పక్కా స్కెచ్ వేసుకుని తెలుగు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు ధనుష్(Dhanush). అయితే ముందు శేఖర్ కమ్ములాతో సినిమా అనౌన్స్ చేసిన స్టార్ హీరో.. ఆతరువాత వెంకీ అట్లూరితో కమిట్ అయ్యాడు.

 

శేఖర్ కమ్ములా మూవీ త్వరగా స్టార్ట్ అవుతుంది అనుకుంటే.. ముందు వెంకీ అట్లూరి సినిమానే స్టార్ట్ చేశాడు ధనుష్(Dhanush). రీసెంట్ గా పూజా కార్యక్రమాలు చుసుకున్నసార్  సినిమా రీసెంట్ గానే షూటింగ్  స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్.. ఇంపార్టెంట్ సీన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఒక్క రోజు బాగానే షూటింగ్ జరిగింది. కాని హీరో ధనుష్ వద్దన్న కారణంగా ఈ షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. కరోనా భయంకరంగా విరుచుకుపడుతుండటంతో షూటింగ్ ను ఆపేసినట్టు తెలుస్తోంది.

 

ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా సత్యరాజ్ కు సీరియస్ కూడా అయ్యింది. మహేష్,తమన్ లాంటి వారినే కరోనా వదిలిపెట్టలేదు. దాంతో ఇండస్ట్రీలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రెగ్యూలర్ షూటింగ్ చేయడం మంచిది కాదు అని నిర్ణయింకున్నారట హీరో ధనుష్(Dhanush). అందుకే పరిస్థితి చక్కబడే వరకూ..షూటింగ్ పోస్ట్ పోన్ చేశారని సమాచారం.  రిస్క్ తీసుకోవడం అంత మంచిది క దు అనే అభిప్రాయం హీరోతో పాటు టీమ్ అందరికి అనిపించడంతో షూటింగ్ ఆపేసినట్టు తెలుస్తోంది.

Also Read : బ్రేకింగ్: టాలీవుడ్ కి షాక్.. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ విధింపు

ఇప్పటి వరకూ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు ధనుష్(Dhanush). ఇక్కడి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం టాలీవుడ్  అన్ని ఇండస్ట్రీలను తలదన్ని భారీ బడ్టెట్ తో సినిమాలు చేస్తుంది. అటు బాలీవుడ్ కూడా టాలీవుడ్ ముంద చిన్నబోయింది. దాంతో తెలుగులో చేస్తే.. పాన్ ఇండియా క్రేజ్ వస్తుంది అని ప్లాన్ చేశాడు ధనుష్. పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు.

Also Read : Deepika Padukone: కోవిడ్ దీపికా పదుకొనే జీవితాన్నే మార్చేసిందట.. ఎంత నష్టం జరిగిందో తెలుసా....?


 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios