టాలీవుడ్ పై కరోనా పంజా విసురుతుంది. వరుసగా అనేకమంది టాలీవుడ్ సెలబ్రిటీలు దీని బారినపడుతున్నారు. తాజాగా ఇద్దరు లేడీ సింగర్స్ కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. సీనియర్ సింగర్ సునీత మరియు మాళవిక లకు కరోనా సోకింది. వీరిద్దరూ ఓ టీవీ కార్యక్రమం కొరకు షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. దీనితో వీరిద్దరికీ కరోనా సోకినట్లు సమాచారం. దీనితో వీరిద్దరూ హోమ్ కొరెంటైన్ అయ్యారు. వైద్యుల సలహా మేరకు ఇంటిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. 

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మందికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. సింగర్ సునీత మరియు మాళవిక కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యంత భద్రతా నియమాలు పాటిస్తున్నా, జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సోకడం అందరినీ కలవర పెడుతుంది.ఐదు నెలలుగా ఇంటిలో ఉన్న కరోనా సోకిందని సింగర్ స్మిత తెలిపిన సంగతి తెలిసిందే.  

ఇప్పటికే టాలీవుడ్ లో అనేక మంది కరోనా బారినపడ్డారు. నిర్మాత బండ్ల గణేష్, రాజమౌళి కుటుంబం, దానయ్యలకు కరోనా సోకింది. ఇక ప్రముఖ సింగర్ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్నారు. కరోనా కారణంగా ఆయన ఆరోగ్యం విషమ స్థితికి చేరింది. ఐతే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.