ఈ మధ్య సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. అది కూడాభారీ స్థాయిలో జరుగుతున్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఇంట్లో చోరీ జరిగి ఎన్నో రోజులు కావడంలే.. అప్పుడే స్టార్ సింగర్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.


సినిమా స్టార్ సెలబ్రిటీల ఇళ్ళలో వరుస దొంగతనాలు.. ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా రజనీకాంత్ తనయురాలు.. హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ మరవకముందే మరో ఫిల్మ్ స్టార్ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్‌ కుమారుడు, గాయకుడు, నటడు విజయ్‌ యేసుదాస్‌ ఇంట్లో కూడా భారీ దొంగతనం జరిగింది. శుక్రవారం రోజున చోరీ చోటు చేసుకుంది. దీని గురించి విజయ్‌ యేసుదాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలే ఏమైయ్యిందంటే.. 

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఏసుదాసు తనయుడు విజయ్ ఏసుదాసు చెన్నైలోని అభిరామపురంలోని నివాసం ఉంటున్నారు. ఆయన నివాసంలో శుక్రవారం అనగా మార్చి 31, 2023నభారీగా దొంగతనం జరిగింది. ఈ చోటీలో భారీగా విలువైన భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలతో పాటు కొన్ని డాక్యూమెంట్టలు కూడా వారు పట్టుకుపోయినట్టు తెలుస్తోంది. దీని గురించి పోలీసులు ఫిర్యాదు చేసిన విజయ్‌ యేసుదాస్‌.. తన ఇంట్లో పని చేసేవారిపై అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Scroll to load tweet…

రీసెంట్ గా జరిగిన ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ విషయంలో కూడా.. వారి పనిమనిషి ఈశ్వరి దొంతనం చేసి విస్తుపోయేలా నిజాలు వెలల్డించింది. ఈసరి ఆ వంతు విజయ్ ఏసుదాసుదయ్యింది. సెలబ్రిటీల ఇళ్లల్లో ఇలా వరుస దొంగతనాలు చోటు చేసుకోవడం.. అది కూడా పని వారే ఇలా యేస్తుండటంతో.. అంతా కలవరపడుతున్నారు. 

ఇక సింగర్ విజయ్ ఏసుదాసు.. ప్రముఖ మలయాళ గాయకుడు యేసుదాస్‌ కుమారుడు. ఆయన వారసత్వంగ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ నుండి సంగీతంలో బీఏ చేశాడు విజయ్. సౌత్‌లో అన్ని ఇండస్ట్రీల్లో పాటలు పాడాడు. విజయ్‌ది ప్రమే వివాహం. ఈయన భార్య పేరు దర్శన. వీరికి ఒ​క కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు.