తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. అందులో చాలా మంది స్టార్స్ అయ్యారు.. కొంత మంది ఆదరణ లేక వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మరో వారసుడు సందడి చేయబోతున్నాడు.
టాలీవుడ్ లో మరో వారసుడు సందడి చేయబోతున్నాడు. సింగర్ గా టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోన్న సునిత వారసత్వం టాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వబోతోంది. . అయితే ఆమె వారసత్వం గానంలో కాదు.. నటనలో టాలెంట్ చూపించబోతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది సునీత. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటింది. ఆమె వాయిస్ మాత్రమే కాదు బ్యూటీ కూడా చాలా మందిని ఆకట్టుకుంది. ఎంత ఏజ్ వచ్చినా.. అంత అందంగా మెయింటేన్ చేస్తుంది సింగర్ సునీత.
ఇక ఆమెకు హీరో అయ్యేంత కొడుకు ఉన్నాడంటే చాలా మంది నమ్మరు. కాని ఇది నిజం సునిత తనయుడు ఆకాశ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సునితకు సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సునిత తో పాటు ఆమె తనయుడు, కూతురు కూడా తల్లితో పాటు ఫోటోలు, వీడియోలతో సందడి చేస్తుంటారు. అయితే సునిత భర్త నుంచి విడిపోయి.. పిల్లలను తానే కష్టపడి పెంచింది. చాలా కాలంగా భర్తతో దూరంగా ఉన్న సునిత ఆ మధ్యనే మరో పెళ్ళి చేసుకుంది.
రీసెంట్ గా వ్యాపార వేత్త..మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుని ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది సునిత . రీసెంట్ గా తన భర్త రామ్ ఓ వివాదంలో చిక్కుకోవడంతో సునీత కూడా హాట్ టాపిక్ అయింది. తాజాగా సునీత కుమారుడికి సంబంధించి న్యూస్ బయటకొచ్చింది. సునీత కుమారుడు ఆకాష్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆకాష్ ను హీరోగా పరిచయం చేయడానికి సునీత రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ విషయంపై సునితా ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆకాశ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. తన కొడుకు సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్తున్నాడని... అతన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు. అయితే ఏ సినిమా చేయబోతున్నాడు? దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
