సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండవ వివాహం చేసుకోనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సునీత వివాహం పై వరుస కథనాలు వస్తున్నా, సునీత స్పందించలేదు. ఆ వార్తలను ఖండించడం లేదా సమర్ధించడం చేయలేదు. కాగా హఠాత్తుగా నేడు సింగర్ సునీత ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్లు తెలుస్తుంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైన ఈ వేడుకను ఆర్భాటాలకు దూరంగా, మీడియా కంటికి తెలియకుండా సింగర్ సునీత జరుపుకున్నారు. 

ఇక సునీత చేసుకోబోయేది వ్యాపారవేత్తగా సమాచారం అందుతుంది. ఓ యూట్యూబ్ మీడియా సంస్థకు చెందిన అధిపతితో సింగర్ సునీత ఎంగేజ్మెంట్ జరుపుకున్నారట. త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం. మొదటి భర్తతో విడిపోయిన సునీత చాలా కాలంగా ఒంటరి జీవితం గడుపుతున్నారు. వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. 

ఇక సింగర్ గా 1995లో కెరీర్ ప్రారంభించిన సునీత వెయ్యికి పైగా సాంగ్స్ వివిధ భాషలలో పాడారు. తియ్యనైన స్వరం కలిగిన సునీత అనేక మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గాత్ర దానం చేశారు. పలు టీవీ కార్యక్రమాలలో జడ్జ్ గా కూడా సునీత వ్యవహరించడం జరిగింది.