పెళ్లెప్పుడంటే కొడతానంటోంది సింగర్‌ సునీత. దాని గురించి మాట్లాడవద్దని పేర్కొంది. `హుష్‌` అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. మరి ఇటీవల రామ్‌ వీరపనేనితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సునీత ఇలాంటి కామెంట్‌పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

సింగర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకుంది సునీత. ఆమె కొద్ది రోజుల క్రితం తన మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది. చాలా రోజులుగా ఒంటరిగానే ఉంటున్న సునీత ఎట్టకేలకు రెండో పెళ్లికి సిద్దమైంది. ఇటీవల డిజిటల్‌ రంగంలో రాణిస్తున్న రామ్‌ వీరపనేనితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఈ నెల 27న ఆమె వివాహం జరుగబోతుందంటూ ప్రచారం జరిగింది. 

ఇదిలా ఉంటే ఇప్పట్లో వీరి మ్యారేజ్‌ జరిగే అవకాశం లేదట. తాజాగా ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో సునీత స్పందించారు. మీ పెళ్ళి ఎప్పుడని విలేకరి అడగ్గా, `హుష్‌.. `అంటూ వేలితో నోటిని కవర్‌ చేసింది. మరోవైపు మీరు పెళ్ళి ఇక్కడే చేసుకుంటారా? బయట చేసుకుంటారా? అని అడగ్గా నవ్వుతూ కొట్టేస్తానని సరదాగా కామెంట్‌ చేసింది.  ఈ సందర్భంగా చీరలోని అందాన్ని వర్ణించింది సునీత. తనకు చీర అంటే ఇష్టమని, అందులోనే హుందాతనం, అందం ఉందని, చీరలో మన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పింది. అయితే ఇప్పట్లో మ్యారేజ్ ఉండదని, వచ్చే ఏడాది ప్లాన్‌ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో సునీత సెకండ్‌ మ్యారేజ్‌ ఎప్పుడనేదానిపై సందేహాలు నెలకొన్నాయి.