సింగర్ సునీత రెండో వివాహం చేసుకోనున్న సగంతి తెలిసిందే. మాంగో మీడియా యజమాని రామ్ వీరపనేనితో ఆమె వివాహం త్వరలో జరగనుంది. ఈ నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ పార్టీలతో సందడి చేస్తున్నారు సునీత అండ్ రామ్. గత రాత్రి హైదరాబాద్ లోని బోల్డర్స్ హిల్స్ హోటల్ లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఈపార్టీకి సింగర్ సునీత మరియు రామ్ మితృలు, సన్నిహితులు హాజరయ్యారు. 

కాగా కొద్దిరోజుల ముందు మరొక పార్టీని రామ్,సునీత ఏర్పాటు చేశారు. లైవ్ మ్యూజిక్ కచేరి ఏర్పాటు చేయడంతో పాటు కేక్ కట్ చేసి తమ ఆనందం తెలుపుకున్నారు. ఈ పార్టీలో రేణూ దేశాయ్, యాంకర్ సుమ కూడా పాల్గొన్నారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహమని సమాచారం అందుతుంది. డిసెంబర్ 27న సునీత, రామ్ ల వివాహం అని ప్రచారం జరిగింది. కారణం ఏదైనా వచ్చే ఏడాదికి సునీత తన వివాహం వాయిదా వేసుకున్నారు. నూతన సంవత్సర ప్రారంభంలో ఈ జంట కొత్త జీవితం మొదలుపెట్టనున్నారు. 

19ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ గోపరాజుని ప్రేమ వివాహం చేసుకున్న సునీత 17ఏళ్లకే సింగర్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.  వీరికి ఆకాష్, శ్రేయా ఇద్దరు పిల్లలు. కిరణ్ - సునీత కొన్నేళ్ల క్రితం చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వీరు విడిపోయారు. అప్పటి నుండి పిల్లలతో ఒంటిగా ఉంటున్న సునీత రెండో వివాహంగా రామ్ ని చేసుకొన్నారు.