సింగర్ యశస్వి కొండెపూడి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. నవసేవ ఎన్జీవో తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు యశస్వి అబద్ధపు ప్రచారం చేసుకున్నాడనేది ప్రధాన ఆరోపణలు.  

ఫరా కౌసర్ అనే మహిళ నవసేవ అనే ఎన్జీవో నిర్వహిస్తున్నారు. ఆమె సింగర్ యశస్విపై ఆరోపణలు చేశారు. ఓ షో వేదికగా యశస్వి అబద్దపు ప్రచారం చేశాడు. నవసేవ ఎన్జీవోకి చెందిన కొందరు పిల్లలను నేను చదివిస్తున్నానని అసత్యాలు చెప్పారు. చేయని సేవ చేస్తున్నట్లు చెప్పి నేమ్, ఫేమ్ రాబట్టే ప్రయత్నం చేశాడని ఆమె మీడియా ముఖంగా ఆరోపణలు చేశారు. ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. 

ఈ క్రమంలో యశస్వి వివరణ ఇచ్చారు. నేను నవసేవ ఎన్జీవో తరపున పిల్లలను చదివిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. సరిగమప సింగింగ్ షోలో వేసిన ఒక ప్రోమోలో నవసేవ అనే బోర్డు కనిపించింది. దాంతో మా సంస్థ పేరు వాడుకొని మీరు ఫేమ్ తెచ్చుకున్నారు. నవసేవ ఎన్జీవోకి సహాయం చేసినట్లు క్లెయిమ్ చేశారు. కాబట్టి ఏడాది పాటు దత్తత తీసుకోమని అన్నారు. నా స్థోమత కొద్ది నేను సహాయం చేస్తాను. దత్తత తీసుకోవడం అంటే నా వల్ల కాదు అన్నాను. అప్పుడు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. నా బుద్ది తక్కువై ఎపిసోడ్ కి నా సేవా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు ఇచ్చాను... అని యశస్వి వివరణ ఇచ్చారు. 

View post on Instagram

ఈ వివాదంలో సింగర్ శ్రీకృష్ణ యశస్వికి మద్దతుగా నిలిచాడు. యశస్వి ఆల్రెడీ అందరికీ తెలిసిన సింగర్. అతనికి జనాల్లో ఫేమ్ ఉంది. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ వేయాల్సిన అవసరం లేదు. అతని గురించి తెలిసినవాడిగా చెబుతున్నా... యశస్వి చాలా ధార్మిక సంస్థలకు సహాయం చేశాడు. ఈ వివాదంలో యశస్వికి నా మద్దతు తెలుపుతున్నాను.. అంటూ సుదీర్ఘ సోషల్ మీడియా సందేశం పోస్ట్ చేశాడు. 

View post on Instagram