సీఎం కేసీఆర్ గారు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి... సింగర్ శ్రీరామచంద్ర తీవ్ర అసహనం!
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై సింగర్ శ్రీరామచంద్ర అసహనం వ్యక్తం చేశారు. మీ వలన నా ఫ్లైట్ మిస్సయిందంటూ బాధపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధుల మీటింగ్స్, రోడ్ షోలు, కాన్వాయ్స్ వలన తరచుగా పబ్లిక్ ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. సాధారణ ప్రజల జీవితాలను పొలిటికల్ ఈవెంట్స్ ఇబ్బందిపెడుతూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటన సింగర్ శ్రీరామచంద్ర అసహనానికి కారణమైంది. ఓ పొలిటీషియన్ కోసం ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారట. దాంతో ఆయన ఎక్కాల్సిన గోవా ఫ్లైట్ మిస్ అయ్యారట. తన అసహనం, పబ్లిక్ ఇబ్బందులు తెలియజేస్తూ ఆయన వీడియో పోస్ట్ చేశారు.
ఓ పొలిటీషియన్ కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దాంతో పబ్లిక్ క్రింది నుండి పోవాల్సి వచ్చింది. హెవీ ట్రాఫిక్ ఏర్పడటంతో అరగంట ఆలస్యమైంది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. వేరే ఫ్లైట్ పట్టుకోవడం గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు మరికొందరు ఇదే రీజన్ తో ఫ్లైట్ మిస్ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గార్లకు నా విన్నపం ఏమిటంటే... పొలిటికల్ లీడర్స్ కోసం సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి... అంటూ వీడియో షేర్ చేశారు.
సింగర్ శ్రీరామచంద్రకు ఈ విషయంలో నెటిజెన్స్ నుండి మద్దతు లభిస్తుంది. ఆయన వీడియో పలువురిలో అవగాహనకు కారణమైంది. అయితే కొన్ని విషయాల్లో ఎవరేం చేయలేరు. ప్రోటోకాల్ పేరుతో కొన్ని పాటించాల్సిందే. ఇక స్టార్ సింగర్ గా శ్రీరామచంద్రకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇండియన్ ఐడల్ విన్నర్ గా ఉన్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పాపులారిటీ రాబట్టారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన శ్రీరామచంద్ర సెకండ్ రన్నర్ గా నిలిచాడు. వీజే సన్నీ సీజన్ 5 విన్నర్ గా టైటిల్ అందుకున్నారు.