స్టార్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తన కుమారుడిని పరిచయం చేసింది. తన భర్త శిలాదిత్యతో కలిసి కుమారుడిని చేతుల్లో ఎత్తుకుని దిగిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా బుధవారం పంచుకుంది శ్రేయాఘోషల్‌.

స్టార్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తన కుమారుడిని పరిచయం చేసింది. తన భర్త శిలాదిత్యతో కలిసి కుమారుడిని చేతుల్లో ఎత్తుకుని దిగిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా బుధవారం పంచుకుంది శ్రేయాఘోషల్‌. తన ముద్దుల కుమారుడిని పరిచయం చేసిన శ్రేయా చిన్నారి ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. కుమారుడు పేరుని కూడా ప్రకటించింది. `దేవ్యాన్‌ ముఖోపాధ్యాయ`గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని కూడా వెల్లడించింది శ్రేయా. మొత్తానికి కుమారుడిని పరిచయం చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది శ్రేయా. 

Scroll to load tweet…

మే 22న శ్రేయా ఘోషల్‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రేయా చెబుతూ, `ఇంట్రడ్యూసింగ్‌ దేవ్యన్‌ ముఖోపాధ్యాయ. అతను మే 22న మా జీవితంలోకి వ్చాడు. మా జీవితాలను శాశ్వతంగా మార్చేశాడు. ఆయన ఎంట్రీ మా హృదయాలను ఓ రకమైన ప్రేమతో నింపాడు. ఒక తల్లి, ఒక తండ్రి మాత్రమే ఇలాంటి మధురమైన అనుభూతిని పొందగలడు. స్వచ్ఛమైన, హద్దుల్లేని ప్రేమకి నిదర్శనం` అని పేర్కొంది శ్రేయా ఘోషల్‌. 

Scroll to load tweet…