టాలీవుడ్ సింగర్ రేవంత్ తో మాట్లాడిస్తామని, ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ సైబర్ నేరస్తులు వసూళ్లకు పాల్పడుతున్నారు.

రేవంత్ కి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి అకౌంట్లను హ్యాక్ చేసిన కొందరు సైబర్ నేరస్తులు కొద్దిరోజులుగా రేవంత్ పేరుతో 
డబ్బు వసూలు చేస్తున్నారు.

రేవంత్ స్నేహితుల్లో కొందరు డబ్బు తీసుకుంటేనే అభిమానులతో మాట్లాడతావా అంటూ అతడిని ప్రశ్నించడంతో విషయం తెలుసుకున్న రేవంత్ తన ఫేస్ బుక్ ఖాతాను చూడగా.. తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి ఇలా చేస్తున్నారని గ్రహించాడు.

వెంటనే ఆయన సైబర్ క్రైమ్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదుచేశారు. తన పేరుతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఉన్న నకిలీ ఖాతాలను తొలగించాలని, నిందితులను గుర్తించి వారిని శిక్షించాలని పోలీసులను కోరాడు.