గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న టాలీవుడ్ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యింది. గాయకుడు, నటుడు నోయెల్ - హీరోయిన్ ఎస్తేర్‌ నోరోన్హా క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు నోయెల్ సుపరిచితమే. ముఖ్యంగా కుమారి 21 F - ఈగ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నోయెల్ పెళ్లిపై ఇటీవల అనేక వార్తలు వచ్చాయి. 

మంగళూరుకు చెందిన నటి ఎస్తేర్‌ నోరోన్హా తేజ దర్శకత్వం వహించిన 1000 అబద్దాల సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశం అందుకున్నప్పటికీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఎస్తేర్‌ నోరోన్హా తో దిగిన పెళ్లి పోటోలను నోయెల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. 

మేమిద్దరం వేరు కాదు ఒక్కటే అని చెబుతూ.. తను నా మహారాణి అని నోయెల్ ట్వీట్ చేశాడు. మంగళూరులో జరిగిన పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, సింగర్స్ అలాగే దర్శకుడు రాజమౌళి - రమ హాజరయ్యారు.