యాక్సిడెంట్ లో మృతి చెందిన సింగర్!

singer manjusha mohan dies in accident
Highlights

మలయాళీ గాయని మంజూష మోహన్(27) ఇటీవల జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలయ్యారు.

మలయాళీ గాయని మంజూష మోహన్(27) ఇటీవల జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్ లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. గతవారం మంజూష తన స్నేహితురాలు అంజనతో కలిసి అంగమలై అనే ప్రాంతంలో స్కూటీలో ప్రయాణం చేస్తోంది.

ఈ నేపథ్యంలో వారికి ఎదురుగా వచ్చిన వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన మంజూషను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాన్ రాంగ్ రూట్ లో రావడం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

2009 లో జరిగిన ఐడియా స్టార్ సింగర్ తో పాపులర్ అయిన మంజూష శ్రీ శంకరాచార్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో డిగ్రీ పొందింది. ప్రియదర్శన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె ఇప్పుడు చనిపోయారనే విషయాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

loader