Asianet News TeluguAsianet News Telugu

అర్చన చాలా ఓవర్ చేసింది, అలాగని నేను కక్ష సాధించలేదు-మధుప్రియ

  • బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికొచ్చిన సింగర్ మధుప్రియ
  • బిగ్ బాస్ హౌజ్ లో కొందరి ప్రవర్తన వల్లే బయటికొచ్చానన్న మధు ప్రియ 
  • అర్చన చాలా దురుసుగా ప్రవర్తించిందని పేర్కొన్న మధుప్రియ

 

SINGER madhupriya speaks out after comingg out of big boss house

తాజాగా ఫిదా చిత్రంలోని వచ్చిండే.. క్రీమ్ బిస్కెట్ ఏసిండే.. పాటతో క్రేజీ సింగర్ గా మారిన సింగర్ మధుప్రియ... అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పార్టిసిపెంట్ గా తెలుగు ఆఢియెన్స్ కు మరింత చేరువైంది. అయితే చిన్నపిల్లలా కన్నీరు కారుస్తూ కొనసాగిన మధుప్రియ ఏడుపు ఎపిసోడ్స్ తో బిగ్ బాస్ షోలో ఆమె ప్రవర్తన వివాదామైనప్పటికీ.. చివర్లో ఆమె వ్యవహరించిన తీరు అందర్ని ఆకట్టుకొంది.

 

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఎన్టీఆర్‌తో 30 నిమిషాలు మధుప్రియ ముచ్చటించిన తీరు, ఆమె చూపించిన చొరవ బుల్లితెర వీక్షకుల్లో మంచి ఫీలింగ్ కల్పించింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మధుప్రియ ఓ టీవీ ఛానెల్ తో ముచ్చటించింది. “ఫిదా సినిమాలో నేను పాడిన పాటకు మంచి రెస్సాన్ రావడం ఆనందంగా ఉంది. దీనికితోడు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం మరింత సంతోషాన్నిచ్చింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫిదా సినిమా చూశాను. సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నేను పాడిన పాటకు మంచి స్పందన రావడం మరీ ఆనందాన్ని ఇచ్చింది” అని చెప్పుకొచ్చింది.

ఇక బిగ్ బాస్ షోలో సినిమా అవకాశాలు లేక అర్చనగా పేరు మార్చుకున్నా పెద్దగా కలిసిరాని వేద కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆమెతో షోకు కాస్త గ్లామర్ యాడ్ అవుతుందని అంచనా వేస్తే అది కాస్తా తలకిందులైంది. దీంతో షోలో గ్లామర్ డాల్ దీక్షా పంథ్ ను రంగంలోకి దించారు. ఇక అర్చనతో బిగ్ బాస్ షోలో జరిగిన గొడవ బాధ కలిగించిందని మదుప్రియ ఫీలైంది. “షోలో అర్చనతో చిన్న విభేదాలు వచ్చాయి. హోమం దగ్గర మంట పెట్టే విషయంలో చిన్న గొడవ జరిగింది. హరితేజ వైపు పొగ మళ్లిపోవడంతో ఆమె బాధపడుతుండటం చూసి అందరూ ఆమెకు సపోర్ట్ చేశారు. అయితే అప్పటివరకు నేను, కార్తీక పడిన కష్టం ఎవరూ పట్టించుకోలేదు. దాని గురించి ఎవరూ అడుగలేదు. కానీ హరితేజ వైపు పొగ రావడంతో అందరు ఆమెపై సానుభూతి చూపించారు. దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

కానీ... హరితేజ వైపు పొగ వస్తోంది. నువ్వు హరితేజ ప్లేస్‌లో కూర్చో అని అర్చన నన్ను అనడం చాలా బాధ కలిగింది. చాలా కోపం వచ్చింది. దాంతో హరితేజ నీవు ఇక్కడికి వచ్చి ఇటు కూర్చో. నాకు పొగ వచ్చిన పర్వాలేదు అని నేను అన్నాను. అందుకు జవాబుగా.. చూస్తే చిన్నపిల్లలా ఉంది. కానీ పొగరుగా బిహేవ్ చేస్తున్నది అని అర్చన అనడంతో ఏడుపు వచ్చింది. అందుకే ఏడ్చాను. బిగ్‌బాస్ హౌస్‌లో కొందరి ప్రవర్తన బాధ కలిగింది. ఓ వైపు చెల్లెలు అంటూనే అర్చన నాతో చాలా దారుణంగా ప్రవర్తించింది. నా గురించి ఏదో మాట్లాడుకుంటూ చెవులు కొరుక్కునే వారు. బిగ్‌బాస్ హౌస్‌లో కొందరి ప్రవర్తన వల్ల నేను చాలా బాధపడ్డాను. వారి మైండ్ సెట్‌ వల్ల హౌస్‌లో అడ్జస్ట్ కాలేకపోయా. అంతేకాక.. కుటుంబం కూడా గుర్తుకొచ్చింది. స్వేచ్ఛగా ఉండే దాన్ని. బిగ్‌ బాస్‌లో బంధించినట్టు అనిపించింది. అందుకే బయటకు రావాలనుకొన్నానంది.

 

అయితే కొద్ది రోజులు గడిచిన తర్వాత బిగ్ బాస్ లో చాలా మందితో మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయని మధుప్రియ తెలిపింది. ఆ తర్వాత వారే ఇంటి నుంచి వెళ్లొద్దని అడిగారు. ఒకసారి నేను వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నాను. అందుకే బయటకు వచ్చాను. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు బాధలేదు. మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే నాకు హౌస్‌లో ఎలా ఉండాలో ఇప్పుడు బాగా తెలుసు. ఇంటిలో ప్రతీ విషయం, ప్రతీ వ్యక్తి ప్రవర్తన నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఒకవేళ అవకాశం వస్తే చాలా మంచి గేమ్‌ను ఆడటానికి అవకాశం ఉంది.

 

బిగ్‌బాస్ ఇంటికి వెళ్లక ముందు ఎలా వున్నానో బయటకు వచ్చిన తర్వాత కూడా అలానే వున్నానని, తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని మధుప్రియ చెప్పింది. “నన్ను ఎవరైనా బాధపడితే నేను ఏడుస్తాను. ఎందుకంటే వారిని నేను బాధపెట్టలేను. కల్పనకు సేవకురాలిగా అర్చనను నియమించి ఆమెపై ఉన్న కసిని, పగను తీర్చుకొన్నానని అందరూ అనడం సరికాదు. కానీ ఆమెపై కోపం ఉన్న మాట వాస్తవమే. కల్పనను అందరూ టార్గెట్ చేశారు. ఆమెకు మంచి చేయాలని అర్చనను సేవకురాలిగా నియమించాను. అంటూ ముగించింది. సో టిట్ ఫర్ టాట్ అనే నానుడి మధుప్రియ బాగానే ఒంటబట్టించుకుందన్నమాట.

Follow Us:
Download App:
  • android
  • ios