అస్సామీ సింగర్ అంగరాగ్ పపన్ మహంత ఓ మ్యూజిక్ రియాల్టీ షో లో  ప్రవర్తించి తీరు వివాదం కొనితెచ్చుకున్నాడు. ఈ షో లో ఇతగాడు ఓ జూనియర్ కంటెస్టెంట్ కి కిస్ ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.తన ఫేస్ బుక్ పేజ్ లో పపన్ ఈ వీడియోను పోస్ట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ది వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్ సీజన్-2 లో జ్యూరీ మెంబర్ గా పాల్గొన్న పపన్.. మైనర్ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు అసభ్యంగా ఉందంటూ సుప్రీంకోర్టు లాయర్ రూనా భుయాన్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు లేఖ రాశారు.