నేను చేసిన పనికి మా నాన్న రోడ్డు మీదే చావకొట్టారు : సింగర్ హేమచంద్ర

First Published 29, May 2018, 11:57 AM IST
singer hemachandra about his childhood memories
Highlights

నేను చేసిన పనికి మా నాన్న రోడ్డు మీదే చావకొట్టారు

గాయకుడిగా హేమచంద్రకి .. గాయనిగా శ్రావణ భార్గవికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఈ ఇద్దరూ కూడా కొంతకాలం క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే .. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి హేమచంద్ర ప్రస్తావించాడు. 

"నా చిన్నప్పుడు .. పాల పాకెట్లు తీసుకురమ్మని మా నాన్న 20 రూపాయలు ఇచ్చారు. అప్పట్లో లీటర్ పాలు 10 రూపాయలకి వచ్చేవి .. రెండు లీటర్ ప్యాకెట్లు తీసుకురమ్మన్నారు. అయితే అప్పుడు నెట్ సెంటర్లో 5 రూపాయలకే గంటసేపు వీడియో గేమ్ ఆడొచ్చు. దాంతో అక్కడికి వెళ్లి మూడు గంటల సేపు ఆడాను .. నాలుగో గంటలో భయంకరమైన ఫైటింగ్ గేమ్ ఆడుతుండగా మా నాన్న అక్కడికి వచ్చారు. ఆ నెట్ సెంటర్ దగ్గరే గట్టిగా ఒక్కటిచ్చారు .. అక్కడి నుంచి ఇంటికి పరిగెడితే కూల్ గా వెనకే వచ్చారు. ఇక అప్పుడు కొట్టిన దెబ్బలు నేను ఇప్పటికీ మరిచిపోలేదు" అని చెప్పుకొచ్చాడు.     

loader