మరోసారి తల్లి అవుతున్న గీతా మాధురి... ఘనంగా సీమంతం వేడుక!
స్టార్ సింగర్ గీతా మాధురి మరోసారి తల్లి కానుంది. ఆమె సీమంతం వేడుక భర్త నందు ఘనంగా నిర్వహించాడు. దీనికి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
గీతా మాధురి టాలీవుడ్ టాప్ సింగర్స్ లో ఒకరు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. గీతా మాధురి నటుడు నందును ప్రేమ వివాహం చేసుకుంది. 2014లో వీరి వివాహం జరిగింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన ఐదేళ్లకు 2019లో గీతా మాధురి మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టగా దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు.
గీతా మాధురి మరోసారి తల్లి అయ్యారు. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉన్నారు. నెలలు నిండుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు సీమంతం వేడుక నిర్వహించారు. పట్టుచీరలో గీతా మాధురి అందంగా ఉన్నారు. గీతా మాధురి సీమంతం వేడుక ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
గీతా మాధురి బిగ్ బాస్ తెలుగు 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్లో సత్తా చాటింది. ఫైనల్ కి వెళ్లిన గీతా మాధురి టైటిల్ రేసులో నిలిచింది. అయితే నటుడు కౌశల్ నుండి ఆమెకు గట్టి పోటీ ఎదురైంది. కౌశల్ టైటిల్ విన్నర్ కాగా, గీతా మాధురి రన్నర్ గా నిలిచింది. ఈ మధ్య గీతా మాధురి జోరు తగ్గింది. ఆమెతో సంగీత దర్శకులు అంతగా పాడించడం లేదు.