బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ పోస్ట్ చేసిన ఓ వీడియోని సింగర్ చిన్మయి తప్పుబట్టారు. శ్రీహాన్ పరోక్షంగా చిన్నపిల్లలపై చెడు ప్రభావం పడేలా ప్రవర్తించాడంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.  

సింగర్ చిన్మయి సోషల్ యాక్టివిస్ట్. ముఖ్యంగా కరుడుగట్టిన ఫెమినిస్ట్. కొందరు కోలీవుడ్ ప్రముఖులపై చిన్మయి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. కెరీర్ లెక్క చేయకుండా ఆ దిశగా ఆమె ఉద్యమం చేస్తున్నారు. వివాదాల అనంతరం ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. చాలా తక్కువ సాంగ్స్ పాడుతున్నారు. గతంలో ఆమె ఏ ఆర్ రెహమాన్ తో పాటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద పనిచేశారు. హీరోయిన్ సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పేవారు. ఈ మధ్య సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. దాంతో ఆ ఆదాయమార్గం కూడా పోయింది. 

 సోషల్ మీడియా వేదికగా పలు విషయాలపై ఆమె స్పందిస్తారు. తాజాగా శ్రీహాన్ పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ వీడియోను ఆమె తప్పుబట్టారు. దానికి ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు. శ్రీహాన్ పోస్ట్ చేసిన వీడియోలో... ఒక చిన్న పిల్లాడికి భయం చెప్పడం కోసం శ్రీహాన్ తనని తాను బెల్టుతో కొట్టుకుంటున్నాడు. సాధారణంగా మాట వింటావా లేదా... అని పిల్లల్ని పెద్దవాళ్ళు కొడతారు. అందుకు భిన్నంగా శ్రీహాన్ సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ... పిల్లాడికి బుద్ధి చెప్పాడు. 

అయితే అది తప్పుడు పద్ధతని చిన్మయి అన్నారు. మన సమాజంలో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకకపోతే చనిపోతామని బెదిరిస్తారు. పెళ్లి, చదువు వంటి విషయాల్లో మా మాట వినాలి... లేదంటే గాయాలు చేసుకుంటాము, ప్రాణాలు తీసుకుంటామని బెదిరిస్తారు. అది సొసైటీలో ఉన్న బ్యాడ్ ప్రాక్టీస్. ఈ విధంగా బాల్యం నుండే అది వాళ్లకు మనం నేర్పకూడదు. రాబోయే జనరేషన్స్ లో అయినా ఈ బెదిరింపుల కల్చర్ ఉండకూడదంటే... పిల్లల ముందు ఇలా ప్రవర్తించకూడదు. వాళ్ళ మనసులపై ఇవి గట్టి ముద్ర వేస్తాయన్న అర్థంలో వివరణ ఇచ్చారు. 

View post on Instagram

ఇక సదరు వీడియోలో ఉన్న కుర్రాడు సిరి మేనమామ కొడుకని సమాచారం. అతడు సిరి వద్దే పెరుగుతాడు. సిరిని అమ్మ, శ్రీహాన్ ని నాన్న అని పిలుస్తాడు. సీజన్ 6 ఫ్యామిలీ వీక్లో సిరి ఆ పిల్లాడితో పాటు హౌస్లో అడుగుపెట్టింది. హౌస్లో ఉన్న కాసేపు బుడ్డోడు అల్లరితో ఆకట్టుకున్నాడు. ఇక శ్రీహాన్ బిగ్ బాస్ తెలుగు 6 రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 40 లక్షలు తీసుకొని టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ కోల్పోయాడు. రేవంత్ విన్నర్ గా నిలిచాడు.