ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ పెట్టిన పోస్ట్ పై పాక్ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆయన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కి అద్నాన్ సమీ ధీటైన సమాధానం చెప్పాడు. పాకిస్తాన్ లో పుట్టిన ఈ సింగర్.. కొన్నేళ్ల క్రితం భారత పౌరసత్వం తీసుకున్నారు.

ఇటీవల భారత వైమానిక దళం పాకిస్తాం ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసిన నేపధ్యంలో సమీ భారత్ కి మద్దతిస్తూ.. భారత వైమానిక దళం పట్ల ఎంతో గర్వంగా ఉందని, ఉగ్రవాదాన్ని ఆపండి, జై హింద్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

దాంతో పాకిస్తాన్ నెటిజన్లు అతడిపై మండిపడ్డారు. పాకిస్తాన్ లో పుట్టి.. భారత్ కి మద్దతిస్తున్నావ్.. సిగ్గుగా లేదా అంటూ అద్నాన్ సమీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తనపై ట్రోలింగ్ చేస్తోన్న వారికి ధీటుగా సమాధానం చెప్పాడు.

''డియర్ పాక్ ట్రోల్స్.. ఇక్కడ మీ ఈగో విషయం కాదు. మీరు శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏకిపారేయడం ఇక్కడ విషయం. మీ నీచమైన మెంటాలిటీ పట్ల నవ్వొస్తోంది. మీరు అనే మాటలే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.