సింగర్ అద్నాన్ సమీని ఇండియన్ డాగ్స్ అని తిట్టారట

singer adnan sami claims his staff called indian dogs at kuwait airport
Highlights

సింగర్ అద్నాన్ సమీని ఇండియన్ డాగ్స్ అని తిట్టారు

సింగర్ అద్నాన్ సమి టీమ్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఘోర అవమానం జరిగింది. కువైట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు టీమ్‌ని ‘ఇండియన్ డాగ్స్’ అని తిట్టడంతో తీవ్రంగా కలత చెందాడు ఫేమస్ సింగర్. హ్యాపీగా కువైట్ సిటీకి వచ్చాం.. కానీ, మీరు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. పైగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తమపై దారుణంగా వ్యవహరించారు. మా సిబ్బందిని ఇండియన్ డాగ్స్ అన్నారని రాసుకొచ్చాడు.


కువైట్ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటంటూ అక్కడి ఇండియన్ రాయబారి ఆఫీస్‌కి సమీ ట్వీట్ చేస్తూ హోంశాఖ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, సుష్మాల ట్యాగ్‌లను జత చేశాడు.ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి సుష్మా.. వెంటనే కృతజ్ఞతలు చెబుతూ మరో ట్వీట్ చేశాడు సింగర్. గతంలో సమికి పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఉండగా, మూడేళ్ల కిందట ఆయనకు భారత పౌరసత్వం లభించిన విషయం తెల్సిందే!

loader