స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను హీరోయిన్ శ్వేతా అగర్వాల్ ని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో శ్వేతా మెడలో తాళి కట్టనునట్లు ఆయన వివరించారు. సింగర్ గా, హోస్ట్ గా, నటుడిగా అనేక రంగాలలో రాణిస్తున్న ఆదిత్య నారాయణ్ వివాహం బాలీవుడ్ లో ప్రముఖంగా మారింది. ఇక మా బంధాన్ని రహస్యంగా ఉంచాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఐతే ఓ దశలో మా బంధంపై పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. దీనితో నేను వివరణ ఇవ్వడం జరిగింది అన్నారు. 

తమ బంధం ఎలా మొదలైందన్న విషయాన్ని ఆదిత్య నారాయణ్ తెలియజేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించిన ఆదిత్య నారాయణ్ 2010లో విడుదలైన శాపిత్ మూవీతో హీరోగా మారాడు. ఆ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్వేతా అగర్వాల్ నటించడం జరిగింది. ఆ సినిమా సెట్స్ లో కలిసిన వీరిద్దరూ మొదటి చూపులోనే ఒకరిపై మరొకరు మనసు పారేసుకున్నారట. అలా మొదలైన తమ బంధం పెళ్లి వరకు వెళ్లిందని చెప్పారు. 

దాదాపు 10ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమాయణం సాగించారు. వయసు రీత్యా అప్పుడే పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయం కాదని, ముందు కెరీర్స్ పై దృష్టి పెట్టాలని పెళ్లిని వాయిదా వేశారట. మొత్తంగా ఈ ఏడాది చివర్లో శ్వేతా అగర్వాల్ మెడలో తాళి కట్టనున్నట్లు ఆదిత్య నారాయణ్ వెల్లడించారు. కాగా ఇండియన్ ఐడల్ హోస్ట్ గా ఉన్న సింగర్ నేహా కక్కర్ తో కూడా ఆదిత్య నారాయణ్ ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. సడన్ గా శ్వేతా అగర్వాల్ లో ఆయన పెళ్లి కన్ఫర్మ్ చేయడం ఒకింత సంచలనం రేపుతోంది. ప్రభాస్ నటించిన రాఘవేంద్ర మూవీలో శ్వేతా అగర్వాల్ ఓ హీరోయిన్ ని గా చేయడం విశేషం.