బాలీవుడ్‌  సూపర్‌హిట్‌  చిత్రం ‘అంధాధున్‌’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైవిధ్యమైన కాన్సెప్టుతో వర్కవుట్ అయ్యింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రూ. 32 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.456 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాను వివిధ భాషల్లో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో నితిన్ ఈ రీమేక్ లో చేస్తున్నారు. అలాగే ఈ సినిమా లో టబు పాత్ర కీలకమైంది. ఆ పాత్రలో తెలుగుకు గాను తమన్నాను తీసుకున్నారు. హాట్ ఆంటీగా తమన్నా కనిపించనుంది. 

అలాగే ఈ చిత్రం తమిళ రీమేక్‌లో నటుడు ప్రశాంత్‌ హీరోగా నటిస్తున్నారు. ఆయన తండ్రి త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్‌ దర్శకుడు. ఒరిజనల్ లో టబు బోల్డ్‌ రోల్‌లో నటించారు. ఇప్పుడు ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంపై తమిళంలో ఆసక్తినెలకొంది. ఎట్టకేలకు సిమ్రన్ నటిస్తున్నారని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తన మొత్తం కెరీర్‌లో విభిన్నమైన పాత్రను పోషించబోతుండటం ఆనందంగా ఈ సందర్భంగా సిమ్రన్‌ అన్నారు.

సిమ్రన్ మాట్లాడుతూ.. టబు చేసిన పాత్రను నేను చేయటం పెద్ద బాధ్యతగా అనుకుంటున్నానని తెలిపారు. చాలా రోజుల తర్వాత ఇటువంటి పాత్ర చేస్తున్నానని, ఓ కొత్త అవతారంలో కనిపించడం చాలా ఆనందంగా ఉందని ప్రకటించారు. ఈ పాత్రకు సినిమాలో నిడివి ఎక్కువ. నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇదొకటి అవుతుందన్న నమ్మకం ఉంది’ అని చెప్పారు. తెలుగులో తమన్నా చేస్తున్న పాత్రను తమిళంలో సిమ్రన్ పోషించటంపై అంతటా ఆసక్తి నెలకొంది.