సింహాద్రి మూవీ ని 4k, డాల్బీ, అట్మాస్ వెర్షన్ లో భారీ ఎత్తున విడుదల చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనే సుమారు 150 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమాని ప్రదర్శించారు.
ఎన్టీఆర్- రాజమౌళి కాంబోలో వచ్చిన' సింహాద్రి' రీ రిలీజ్ ని ఓ పండగలా జరుపుకున్నారు అభిమానులు. రీరిలీజ్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న సింహాద్రి సినిమా థియేటర్లలో రీ రిలీజ్ చేసారు. ఈ మూవీ రీ రిలీజ్ అని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఓ రేంజిలో చేస్తున్న హంగామా చేస్తున్నారు. అంతేకాదు సుదర్శన్ థియేటర్ లో సింహాద్రి సినిమాలోని నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి సాంగ్ లిరికల్ వీడియోను భారీ హంగామా నడుమ విడుదల చేశారు. థియేటర్ వద్ద ఎన్టీఆర్ కటౌట్ పెట్టి తెగ రచ్చ రచ్చ చేశారు. ప్రీ రిలీజ్ పంక్షన్ కూడా చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..

తెలంగాణా - 01.06cr
రాయలసీమ - 00.76cr
నెల్లూరు - 00.12cr
గుంటూరు - 00.19cr
కృష్ణా - 00.20cr
వెస్ట్ గోదావరి - 00.10cr
ఈస్ట్ గోదావరి - 00.16cr
ఉత్తరాంధ్ర - 00.27cr
తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి రోడు టోటల్ థియేటర్ గ్రాస్ - 02.90cr
కర్ణాటక - 00.20cr
తమిళనాడు - 00.10cr
భారత్ లో మిగతా ప్రాంతాలు - 00.12cr
USA - 00.46cr
జపాన్ - 00.08cr
మిగిలిన అన్ని ప్రదేశాలు- 00.15cr
ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు టోటల్ థియేటర్ గ్రాస్ - 04.10cr
ఇక దాదాపు ఏడు కోట్ల బడ్జెట్‌తో 2003లో రిలీజైన ఈ మూవీ 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో సింగమలై, సింహాద్రిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపించి అరిపిస్తాడు. భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్‌లో నటించింది. కీరవాణి సంగీతాన్ని అందించాడు. కాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో సింహాద్రిని రీ రిలీజ్ చేసారు. వరల్డ్‌లోనే అతి పెద్ద స్క్రీన్ అయిన మెల్‌బోర్న్ ఐమాక్స్ థియేటర్‌లోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
