ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతున్న శింబు.. వధువు చిత్ర పరిశ్రమకి చెందిన అమ్మాయేనా ?
తమిళనాట శింబు క్రేజీ హీరో. శింబుకి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. శింబు నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. మన్మథ, వల్లభ లాంటి చిత్రాలతో శింబు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు.

తమిళనాట శింబు క్రేజీ హీరో. శింబుకి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. శింబు నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. మన్మథ, వల్లభ లాంటి చిత్రాలతో శింబు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే శింబు తరచుగా వివాదాల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంటాడు.
ఎట్టకేలకు శింబు నాలుగు పదుల వయసులో తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు తెలుస్తోంది. శింబు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శింబు కుటుంబ సభ్యులు సంబంధం ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అమ్మాయి చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తే అని తెలుస్తోంది.
శింబు తండ్రి టి రాజేందర్ కోలివుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరు. తనకు పరిచయం ఉన్న ప్రముఖ సినీ ఫైనాన్సియర్ కుమార్తెతో శింబుకి పెళ్లి ఫిక్స్ చేశారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శింబు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా మొదట ఎదురయ్యే ప్రశ్న అతడి పెళ్లి గురించే. ఇంతకాలం పెళ్లి ప్రశ్నని శింబు దాటవేస్తూ వస్తున్నాడు.
శింబు గతంలో ప్రేమలో రెండు సార్లు విఫలం చెందిన సంగతి తెలిసిందే. మొదట నయనతారతో ప్రేమాయణం సాగించిన శింబు ఆ తర్వాత హన్సికతో వ్యవహారం సాగింది. హన్సికతో దాదాపు పెళ్లి పీటలవరకు వ్యవహారం వెళ్ళింది. ఈ విషయాన్ని శింబు తండ్రి రాజేందర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. కానీ ఊహించని విధంగా బ్రేకప్ జరిగింది.