చూడగానే నవ్వుతో కనిపించేం అందం అమీ సొంతం. పదహారేళ్లేకే నటి అవ్వాలనే బలమైన ఆకాంక్షతో ఎన్నోఊళ్ళు ధాటి చెన్నై సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే 35 ఏళ్లకే ఆమె జీవితంలో నటనే లేని జీవితనాన్ని చేదు అనుభవాలని తట్టుకోలేకపోయింది. నేడు ఆమె జయంతి. 1960 డిసెంబర్ 2న ఏలూరు లో సిల్క్ స్మిత జన్మించింది. 

సినీ జీవితంలో మంచి స్టార్ డమ్ ను చూసిన సిల్క్ కేవలం వ్యాంప్ పాత్రలకే ఎక్కువగా పరిమితమయ్యింది. తెలుగు తమిళ్ అలాగే కన్నడ మలయాళంలో తో బాలీవుడ్ లో ఆమె అందానికి అభిమానులు ఫిదా అయ్యారు. అన్ని భాషల్లో కలుపుకొని ఆమె 200 పైగా చిత్రాల్లో నటించింది. అయితే  విషం లాంటి అంధకారంలో 1996 సెంప్టెంబర్ 23న తన ఇంట్లో సిల్క్ మరణించింది. 

ఆమె మరణం అప్పటి నుంచి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సిల్క్ స్మిత జీవిత ఆధారంగా బాలీవుడ్ లో ది డర్టీ పిక్చర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సిల్క్ స్మితగా విద్యాబాలన్ నటించిన ఆ బయోపిక్ బాలీవుడ్ లో కాసుల వర్షాన్ని కురిపించింది.