బాలయ్య అన్ స్టాపబుల్ షోకి నిజం విత్ స్మిత గట్టిపోటీ ఇచ్చే సూచనలు కలవు. స్మితకు పరిశ్రమలో మంచి సంబంధాలు ఉన్నాయి. రానున్న కాలంలో మరికొందరు టాప్ స్టార్స్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి సోనీ లివ్ నిజం విత్ స్మిత ద్వారా ఆదరణ రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
ఓటీటీలో టాక్ షోని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి స్టార్స్ మద్దతిచ్చి గెస్ట్స్ గా హాజరైనా ప్రయోజనం ఉండదు. ఆహా యాజమాన్యం ఓసారి బొక్క బోర్లా పడింది కూడా. సమంత హోస్ట్ గా 'సామ్ జామ్' పేరుతో ఒక సీజన్ షూట్ చేసి వదిలారు. చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా, తమన్నా వంటి టాప్ సెలెబ్రిటీలను పిలిచి ఎపిసోడ్స్ చేశారు. ప్రయోజనం మాత్రం శూన్యం. స్టార్స్ వచ్చినా వ్యూవర్షిప్ రాలేదు. ఆ దెబ్బతో సామ్ జామ్ డస్ట్ బిన్ లో పడేశారు.
కొంచెం గ్యాప్ ఇచ్చి బాలయ్యతో అన్ స్టాపబుల్ ఆలోచన చేసి సక్సెస్ అయ్యారు. అన్ స్టాపబుల్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బాలయ్య హోస్టింగ్ చేయడం మొదటి కారణం. గెస్ట్స్ జీవితాల్లోని కాంట్రవర్సీ టాపిక్స్ తెరపైకి తెచ్చి చర్చించడం రెండవ కారణం. వారి సమాధానాల్లో నిజాయితీ ఉందా? లేదా? అనేది పక్కన పెడితే, ఇంత వరకు ఎన్నడూ చర్చించని టాపిక్స్ తో షో సాగుతుంది. సినిమాల్లో డైలాగ్స్ కుమ్మేసే బాలయ్య పబ్లిక్ వేదికల్లో సరిగా మాట్లాడలేడనే అపవాదు ఉంది. బాలయ్య హోస్ట్ అనగానే షో మొత్తంగా ఫెయిల్ అంటూ పెదవి విరిచారు.
విమర్శలకు చెక్ పెట్టి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు బాలయ్య. అన్ స్టాపబుల్ సక్సెస్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ టాక్ షోలకు శ్రీకారం చుడుతున్నాయి. తమకున్న పరిచయాలు వాడి టాప్ స్టార్స్ షోలో పాల్గొనేలా చేస్తున్నాయి. నిజం విత్ స్మిత అందులో ఒకటి. సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న నిజం విత్ స్మిత ఫస్ట్ ఎపిసోడ్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. చిరంజీవి గురించి తెలియని కొత్త విషయాలు బయటకు తీయడంలో స్మిత సక్సెస్ అయ్యారు. నిజం విత్ స్మిత చిరంజీవి ఎపిసోడ్ గురించి టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో చర్చ నడిచింది.
చంద్రబాబు నాయిడు, నాని, రాణా, సాయి పల్లవిలతో వరుసగా ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. స్మిత ప్రశ్నల జాబితా గట్టిగానే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య అన్ స్టాపబుల్ షోకి నిజం విత్ స్మిత పోటీ ఇచ్చే సూచనలు కలవు. స్మితకు పరిశ్రమలో మంచి సంబంధాలు ఉన్నాయి. రానున్న కాలంలో మరికొందరు టాప్ స్టార్స్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి సోనీ లివ్ నిజం విత్ స్మిత ద్వారా ఆదరణ రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
