అఫీషియల్.. ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మళ్లీ అదే నెలలో వస్తున్న సిద్ధూ.!
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ గతేడాది ‘డీజే టిల్లు’తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కామెడీ పరంగా చాలా ఆకట్టుకుంది. ఈ మూవీలోని డైలాగ్, సిద్ధూ జొన్నలగడ్డ అటిట్యూడ్, మ్యూజిక్, రొమాంటిక్ అంశాలు ఎంతలా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతోనే సిద్ధూ కూడా తన కెరీర్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంతో ‘డీజే టిల్లు’కు సీక్వెల్ ను కూడా ప్రకటించారు.
రెండో భాగాన్ని Tillu Squre గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్న సంగతి విధితమే. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. పలు కారణాలతో వాయిదా పడింది. తొలుత సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ మల్టీపుల్ మూవీ రిలీజెస్ ఉండటంతో నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
‘టిల్లు స్క్వేర్’ను ప్రపంచ వ్యాప్తంగా 2024 ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ నూ విడుదల చేశారు. పంచెకట్టులో సిద్ధూ ఆకట్టుకున్నారు. పోస్టర్ ఆకట్టుకుంటోంది. అయితే.. ‘డీజే టిల్లు’ చిత్రం గతేడాది ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అదే నెలలో ‘టిల్లు స్క్వేర్’ కూడా రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి బరిలో దిగకుండా ఆ తర్వాత నెలకు రిలీజ్ డేట్ ను షిఫ్ట్ చేయడంతో ఏదైనా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా అని సందేహిస్తున్నారు.
ఏదేమైనా ‘టిల్లు స్క్వేర్’పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ తో మరింత హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే వదిలిన ‘ఫస్ట్ సింగిల్’, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇంకాస్తా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏమేరకు మెప్పిస్తుందో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందోననే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయిక. తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్, స్నేహితుడు పాత్రలో ప్రణీత్ రెడ్డి (మార్కస్) నటిస్తున్నారు. శ్రీ చరన్ పాకాల, రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా.. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. టిల్లూ స్క్వేర్ కల్ట్ స్టేటస్‌ను అందుకుంటుందని, ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నామన్నారు. టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ పాత్ర ‘రాధిక’ తరహాలోనే గుర్తుండిపోయేలా ఉంటుంది.