Asianet News TeluguAsianet News Telugu

సర్జరీ సక్సెస్, రికవరీ అవుతున్నా: సిద్ధార్థ్

రీసెంట్ గా సిద్ధార్థ్ ఒక చిన్న సర్జరీ కోసం లండన్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సిద్ధార్థ్. మీడియా తో మాట్లాడుతూ "మహా సముద్రం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అజయ్ భూపతి ఈ విషయాన్ని వెల్లడించారు. 

Siddharth recovers from spine surgery
Author
Hyderabad, First Published Oct 2, 2021, 7:26 AM IST

సూపర్ హిట్ "బొమ్మరిల్లు" సినిమా తో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధార్థ్ . ఆ తర్వాత నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రం బ్లాక్ బస్టర్ అవటం కలిసి వచ్చింది. అయితే ఆ తర్వాత తెలుగులో కెరీర్ అనుకన్నంతగా సాగలేదు. చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఈ మధ్యనే "గృహం" అనే సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 తాజాగా సిద్ధార్థ్ "ఆర్ ఎక్స్ 100" డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న "మహా సముద్రం" సినిమాలో శర్వానంద్ తో పాటు కలిసి నటిస్తున్నారు. రీసెంట్ గా సిద్ధార్థ్ ఒక చిన్న సర్జరీ కోసం లండన్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సిద్ధార్థ్. మీడియా తో మాట్లాడుతూ "మహా సముద్రం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అజయ్ భూపతి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక చిన్న సర్జరీ పనిమీద సిద్ధార్థ్ లండన్ వెళ్లారని, అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రాలేకపోయినట్లు అజయ్ భూపతి చెప్పారు. ఇప్పుడు సిద్దార్ద్ తన సర్జరీ సక్సెస్ అయ్యిందని , రికవరీ అవుతున్నాను అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

సిద్దార్ద్ ఈ విషయమై చెప్తూ..నేను తిరిగి ఇండియాకు వచ్చేసాను. హైదరాబాద్ లో మహాసముద్రం చిత్రానికి డబ్బింగ్ చెప్తున్నాను. స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు అయిన గాయంతో సర్జరీ చేయించుకన్నాను. కొద్ది కాలం పాటు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. నా సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

ఒక అద్భుతమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెప్పబడుతున్న  "మహాసముద్రం" సినిమాలో అదితి రావు హైదరి మరియు అనూ ఇమాన్యుల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది. ఏ కే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో అక్టోబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios