అప్పట్లో వరస హిట్స్ గా నిలిచిన బోయ్స్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా,బొమ్మరిల్లు వంటి చిత్రాలతో టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా ముద్రవేయించుకున్నాడు సిద్ధార్థ్‌. ఆ తర్వాత అతను చేసిన ఏ సినిమా తెలుగులో ఆడలేదు. ముఖ్యంగా  ఆట చిత్రం తర్వాత గ్యాప్ వచ్చింది.  ఆ తర్వాత తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించబోయాడు కానీ అవీ ఆడలేదు. ఈ నేఫధ్యంలో మళ్లీ తెలుగు ఎంట్రీ ఇవ్వటానికి ఈ సారి రీమేక్ ని ఎంచుకున్నాడు. 

ఈ సంవత్సంలో బాలీవుడ్‌లో కలెక్షన్స్ పరంగానే కాక విమర్శలు ప్రశంసలు పొంది, హిట్‌ సాధించి, టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘అంథాధూన్‌’. శ్రీరామ్‌ రాఘవన్‌ రూపొందించిన ఈ  థ్రిల్లర్‌లో ఆయుష్మాన్‌ ఖురాన, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పుడీ సూపర్‌హిట్‌ చిత్రం  దక్షిణాదిన రీమేక్‌ కానుంది. ఈ  రీమేక్‌ను సిద్ధార్థ్‌తో చేయాలనుకున్నారు దర్శక, నిర్మాతలు. 

అయితే సిద్దార్ద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తన అభిమానులను ఈ రీమేక్ చెయ్యమంటారా అని అడుగాడు.  సిద్ధార్థ్‌ ‘‘అంథాధూన్‌’ లాంటిఅద్భుతమైన చిత్రం రీమేక్‌లో నన్ను ఎంతమంది చూడాలనుకుంటున్నారు? సీరియస్‌గా అడుగుతున్నాను చెప్పండి’’ అంటూ ట్వీటర్‌లో అడిగేశారు. చాలా మంది ఫ్యాన్స్‌ చేయండి అంటూ సమాధానాలిచ్చారు. ఒరిజినల్‌లో యాక్ట్‌ చేసిన ఆయుష్మాన్‌ ఖురాన కూడా ‘చెయ్‌ మచ్చా (మావా)’ అని రిప్లై చేశారు. మరి ఈ రీమేక్‌ చేయటానికి  సిద్ధార్థ్‌ ఏమంటారో చూడాలి.