సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ జంటగా సినిమా రాబోతుంది. పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నెట్‌ ఫ్లిక్స్ లీక్‌ చేసింది. టైటిల్‌  కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ క్రేజీ లవ్‌ బర్డ్స్ గా రాణిస్తున్నారు సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ. తమ రిలేషన్‌షిప్‌ దాస్తూ చెట్టాపెట్టాలేసుకుని తిరుగుతున్నారు. పైకి చెప్పడం లేదుగానీ ఈ ఇద్దరు కలిసి చాలా సందర్భాల్లో మీడియాకి చిక్కారు. విదేశాల్లోనూ కలిసి కనిపించారు. మొత్తానికి ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జోడీకి సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ కలిసి సినిమా చేయబోతున్నారు. యంగ్‌ డైరెక్టర్‌ పవన్‌ సాధినేని దర్శకత్వంలో వీరిద్దరు సినిమా చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని నెట్‌ ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఈ విషయాన్ని ఈ ఓటీటీ మాధ్యమం లీక్‌ చేసింది. సంక్రాంతి సందర్భంగా వరుసగా తమ ఓటీటీ డీల్‌ కుదుర్చుకున్న సినిమాల లిస్ట్ విడుదల చేసింది. అందులో ఈ మూవీని కూడా ప్రకటించడం విశేషం. 

అయితే ఈ మూవీకి `హరిలో రంగ హరి` అనే క్రేజీ టైటిల్‌ని పెట్టడం విశేషం. ఈ మూవీని గురూ ఫిల్మ్స్, క్రాస్‌ పిక్చర్స్ పతాకాలపై సునీత తాటి, హ్యూవూ థామస్‌ కిమ్‌ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ ఓ కొరియన్‌ చిత్రానికి రీమేక్‌ అని తెలుస్తుంది. గతంలో `ఓ బేబీ` వంటి చిత్రాలను ఈ నిర్మాతలు నిర్మించారు. అది కొరియన్‌ మూవీకి రీమేక్‌. మళ్లీ అదే కాంబినేషన్‌ అంటే ఇది కూడా రీమేకే అని భావిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

అదితి రావు హైదరీ ప్రస్తుతం `గాంధీ టాక్స్` అనే సైలెంట్ మూవీ చేస్తుంది. దీంతోపాటు `లయనెస్‌` అనే సినిమాలో నటిస్తుంది. ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఇక సిద్ధార్థ్‌ `ఇండియన్‌2`తోపాటు మరో సినిమా చేస్తున్నాడు. ఇక అజయ్‌ భూపతి రూపొందించిన `మహా సముద్రం` సినిమా సమయంలో ఈ ఇద్దరుప్రేమలో పడ్డారు. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు.