ప్రివ్యూ నేను,ఎన్టీఆర్, మహేష్ చూసాం, వీళ్లంతా అప్పుడు లేరు

కెరీర్‌ ఆరంభంలోనే లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నటుడు సిద్దార్థ్‌ (Siddharth). వెండితెరపై ఎన్నో సక్సెస్‌ఫుల్‌ లవ్‌స్టోరీల్లో నటించిన తన బొమ్మరిల్లు రోజులు ప్రత్యేకమైనవి అంటారు.

Siddhardha about his bommarillu movie preview


సోషల్ మీడియా వచ్చాక అన్నీ మారిపోయాయి. ప్రతీది హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో అది మరీ ఎక్కువగా ఉంది. దాంతో ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి. ఈ విషయం చాలా మంది హీరోలకు బాధను కలిగిస్తోంది. తాజాగా మీడియా వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసారు సిద్దార్ద్.హీరో సిద్ధార్థ్ జూన్ 9న టక్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మహా సముద్రం’ తర్వాత సిద్దార్థ్‌ నటించిన చిత్రం ‘టక్కర్‌’. శంకర్‌ అసిస్టెంట్‌ కార్తిక్‌ దీన్ని తెరకెక్కించారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. జూన్‌ 9న ఇది విడుదల కానుంది.తాజాగా ఈ సినిమా ప్రమోషన్  లో ఇలా మాట్లాడాడు.

సిద్దార్ద మాట్లాడుతూ... "ఒకప్పుడు #Bommarillu ప్రివ్యూ నేను, #NTR , #Maheshbabu చూసాం, ఆ ప్రసాద్ ల్యాబ్ లో మేము ముగ్గురే ఉన్నాం ఈ ఇనిస్ట్రగ్రమ్ ఇన్ఫూలియన్సర్స్, యూట్యూబర్స్  ఈ బ్యాచెస్ లేవు అప్పట్లో , తర్వాత  డిన్నర్  చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్లి పడుకున్నాం. అలాంటి ఒక ఇన్సిడెంట్ ఈరోజుల్లో జరగడం చాలా కష్టం ఎందుకంటే హీరోలు కలుస్తున్నారంటే చాలు ఇంటి దెగ్గర నుంచి ౩౦ కెమెరాల తో  లైవ్ టెలీకాస్ట్ తో  రెడీ గా ఉంటుంది, మళ్ళి దానికి పొలిటికల్ కలర్ యాడ్ చేస్తారు, ఈ తలనొప్పి అంతా ఎందుకు అని ఎవరు కలవట్లేదు " అంటూ సిద్దార్ద చెప్పుకొచ్చారు. 

 ‘టక్కర్‌’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘నా నుంచి ఫుల్‌ కమర్షియల్‌ సినిమా ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. వాళ్లకు సమాధానమే ఈ సినిమా. కార్తిక్‌ ఈ కథ చెప్పిన వెంటనే నాకెంతో నచ్చేసింది. ముఖ్యంగా లవ్‌స్టోరీ, అందులోనూ హీరోయిన్‌ పాత్ర విభిన్నంగా అనిపించాయి. ఇది తప్పకుండా కమర్షియల్‌ హిట్‌ అవుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా తర్వాత ప్రతి మూడు నెలలకు నా సినిమా రిలీజ్‌ కానుంది. నా కెరీర్‌లో ఇదొక కీలక సమయం. ‘టక్కర్‌’లో నా పాత్ర ఎంతో కొత్తగా ఉంటుంది. దీని కోసం ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ తీసుకున్నా. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నా. 35 రోజులపాటు ఫైట్‌ సీన్స్‌ షూట్‌ చేశాం. ‘మహాసముద్రం’ బాగా ఆడి ఉంటే నాలుగు నెలల్లోనే మరో కొత్త సినిమాతో వచ్చేవాడిని. మేము ఎంతో ఇష్టపడి చేశాం. కాకపోతే అది సరిగ్గా వర్కౌట్‌ కాలేదు. కెరీర్‌లో ఏ సినిమా విషయంలోనూ నేను బాధపడటం లేదు. ఎందుకంటే ప్రతి చిత్రాన్ని ముందు కథ విని.. నచ్చితేనే చేశాను’’ అని ఆయన వివరించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios