Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ.. ఆ సమయానికి ఓ ఇంటివాడు అయిపోతాడు.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్దమ్మ శ్యామాలాదేవి క్లారిటీ ఇవ్వడం విశేషం. ఏమన్నారంటే.. 
 

Shyamaladevi responded on  Prabhas Marriage NSK
Author
First Published Oct 17, 2023, 7:18 PM IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ (Prabhas) ఎప్పుడు ఓ ఇంటివాడవుతాడని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కంటే చిన్న వయస్సున్న హీరోలు వివాహ బంధంలో అడుగుపెతుంటే.. డార్లింగ్ మ్యారేజ్ ఎప్పుడనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఎప్పుడూ ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన క్లారిటీ రాలేదు. ఆ మధ్యలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోకు హాజరైన ప్రభాస్ కూడా ‘పెళ్లి ఎప్పుడనే’ ప్రశ్నను దాటవేశారు. 

ఇక తాజాగా ప్రభాస్ పెళ్లిపై దివంగత, రెబల్ స్టార్ కృషం రాజు భార్య శ్యామలాదేవి స్పందించారు. డార్లింగ్ పెళ్లి ఎప్పుడు ఉండబోతుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈక్రమంలో మీడియాతోనూ మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ అగిన ప్రశ్నకు స్పందించారు. 

పెద్దమ్మ శ్యామాలా దేవి మాట్లాడుతూ.. ప్రభాస్ తప్పకుండా పెళ్లి చేసుకుంటారని, ఆ రోజు త్వరలోనే ఉంటుందన్నారు. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటి వాడు కాబోతున్నారని స్పష్టం చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నెక్ట్స్ మ్యారేజ్ ఉండబోతుందనడంతో అమ్మాయి ఎవరు? డేట్ ఎప్పుడు ఉంటుంది వంటి వివరాల కోసం ఎదురుచూస్తున్నారు. 

కాగా ప్రభాస్ 1979 అక్టోబర్ 23న జన్మించారు. మరో 12 రోజుల్లో డార్లింగ్ బర్త్ డే రానుంది. దీంతో డార్లింగ్ 44వ ఏటా అడుగుపెట్టబోతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘స్పిరిట్’, మారుతీతో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ఈయర్ వరకు ఈ సినిమాలన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక నెక్ట్స్ ‘సలార్ : పార్ట్ 1’తో రానున్నారు. ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios