బాలీవుడ్ లో పలు సీరియళ్లు, సినిమాలలో నటించిన శ్వేతా సాల్వే ఇటీవల తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవాకి వెళ్లింది. అక్కడ బికినీలో స్మోక్ చేస్తూ తీసుకున్న ఫోటోని శ్వేతా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. ఇలా చేయడానికి మీకు సిగ్గు లేదా..? అంటూ ఆమెను వ్యక్తిగతంగా దూషించారు.

మరికొందరు మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లే వస్తాయంటూ కామెంట్లు పెట్టారు. వీరిపై స్పందించిన శ్వేతా వారికి ఘాటు సమాధానమిచ్చింది. ''నేను తాగుతాను.. స్మోక్ చేస్తాను. నిజాయితీగా ఉంటాను. నేను డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం వంటి కారణాల వలన మంచి తల్లిని కాకుండా పోతానా..? నా జీవితాన్ని వృధా చేసుకోవడం మీరు చూశారా..? పని చేయకుండా ఖాళీగా ఉండడం మీరు చూశారా..?

నా పిల్లలను నేను నిర్లక్ష్యంగా వదిలేయడం మీరు చూశారా..? రోజూ ఎన్నో పనులతో నేను బిజీగా ఉంటాను. నేను నటిని, డాన్సర్ ని, పారిశ్రామికవేత్తని కూడా.. ఇతరులను నేను ఈ విధంగా ప్రశ్నించను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు కూడా ఇలాంటి ప్రశ్నలు వేయకండి. నా తల్లితండ్రులు నన్ను పద్దతిగానే పెంచారు.

సమాజంలో మంచి, చెడు రెండు తెలిసేలా పెంచారు. వాళ్లు కూడా మందు తాగినవారే, ధూమపానం చేసినవారే.. ఇప్పటికి కూడా మేం జరుపుకునే వేడుకల్లో నా తల్లితండ్రులతో కలిసి మద్యం సేవిస్తాను. నా పద్ధతి మీకు నచ్చకపోతే నన్ను అన్ ఫాలో చేయొచ్చు'' అంటూ మద్యం తాగుతున్న ఫోటోని షేర్ చేసింది.