. ఈమెకి కేవలం మలయాళ భాషలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, తదితర భాషలలో కూడా అభిమానులు ఉన్నారు. ఆమె తాజాగా సైబర్ మోసానికి గురి అయ్యింది.
రతి నిర్వేదం చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ చాలా మందికి బాగానే గుర్తుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మలయాళ నటి శ్వేతా మీనన్ కూడా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైనదే. ఈమెకి కేవలం మలయాళ భాషలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, తదితర భాషలలో కూడా అభిమానులు ఉన్నారు. ఆమె తాజాగా సైబర్ మోసానికి గురి అయ్యింది. ఆమెకు లింక్ పంపి డబ్బులు ఎక్కౌంట్ నుంచి లాగేసారు. వివరాల్లోకి వెళితే..
KYC, పాన్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని చెప్పి, ఓ ప్రయివేటు బ్యాంక్ కస్టమర్లకు సందేశాలు పంపించి వారి అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో మాయం చేసిన మరో సంఘటన వెలుగు చూసింది డియర్ కస్టమర్, ఈ రోజు మీ బ్యాంక్ అకౌంట్ లాక్ అయింది. కాబట్టి మీ పాన్ కార్డ్ వివరాలు, కేవైసీ పూర్తి చేసి సమస్యను పరిష్కరించుకోండి అని సందేశం పంపించింది. ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో ప్రముఖ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. కేవలం ఆమె ఖాతా నుండి 57,600 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు సదరు ప్రయివేటు బ్యాంక్ కు చెందిన చాలామందికి ఈ సందేశాలు పంపించారు. ఈ ఫ్రాడ్ విషయం తెలియని 40 మంది ఈ లింక్ పైన క్లిక్ చేసి కస్టమర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ ఎంటర్ చేయడంతో వారి వారి ఖాతాలలో నుండి లక్షల రూపాయలు మాయం అయ్యాయి.
ఇటీవల తనకు ఓ లింక్ వచ్చిందని, అది బ్యాంక్ నుంచే వచ్చిందని నమ్మి లింక్‌ను క్లిక్ చేశానని ఆమె తెలిపారు. ఇలా క్లిక్ చేసి తన కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ నమోదు చేశానని పోలీసులకు ఆమె వివరించారు. ఇంతలో బ్యాంక్ అధికారినంటూ ఒక మహిళ ఫోన్ చేసి తన మొబైల్ నంబర్‌కు వచ్చిన మరో ఓటీపీని నమోదు చేయాలని చెప్పడంతో అలాగే చేశానని, ఆ తర్వాత తన ఖాతా నుంచి రూ.57,636 కట్ అయిందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు, ముంబై పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నటి శ్వేతా మీనన్ కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది చదువు పూర్తయిన తరువాత సినిమాల పై మక్కువ కలగడంతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది ఆ తర్వాత కొంతకాలం పాటు మోడలింగ్ రంగంలో కూడా పనిచేసింది. 1991వ సంవత్సరంలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి హీరోగా నటించిన “అనస్వరం” అనే మలయాళ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది.ఆ తర్వాత పలు చిత్రాలలో రెండో హీరోయిన్ మరియు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన ఇప్పటికీ పెద్దగా కలిసి రాలేదు బోల్డ్ తరహా చిత్రాలు నటించడానికి సిద్ధపడింది. ప్రస్తుతం శ్వేతా మీనన్ మలయాళ భాషలో రెండు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది అయితే ఇందులో బ్లాక్ కాఫీ అనే చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. “బాదల్” అనే మరో మలయాళ సినిమా షూటింగ్ జరుగుతోంది.
