తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న నటి శ్వేతా బసు ఆ తరువాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈ బ్యూటీ ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ తో కొంతకాలం ప్రేమాయణం సాగించింది.

ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. గురువారం రాత్రి పూణేలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సన్నిహితులు కూడా హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక జరిగింది.

శ్వేతా బసు పింక్ కలర్ పట్టు చీరలో అందంగా కనిపిస్తోంది. పెళ్లి వేడుకల్లో శ్వేతాబసు, రోహిత్ మిట్టల్ లు కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ లు చేయడంతో సందడి వాతావరణం నెలకొందట. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను శ్వేతా బసు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Dec 13, 2018 at 8:32am PST