Asianet News TeluguAsianet News Telugu

శృతిహాసన్... టమోటో తొక్కు మ్యాటర్

ఒకవైపు సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా శృతిహాసన్ వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటూనే ఉంది. లాస్ట్ ఇయిర్ లాక్ డౌన్ టైమ్ లో ఆమె తన వంటకాల గురించి కూడా తన ఇనిస్ట్ర ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. తనకు వంట చేయటం అంటే ఇష్టమంది. 

Shruti Hassan Interesting Comments for Netizens Questions jsp
Author
Hyderabad, First Published Jun 10, 2021, 11:32 AM IST

రవితేజతో చేసిన క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ఒకవైపు సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా శృతిహాసన్ వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటూనే ఉంది. లాస్ట్ ఇయిర్ లాక్ డౌన్ టైమ్ లో ఆమె తన వంటకాల గురించి కూడా తన ఇనిస్ట్ర ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. తనకు వంట చేయటం అంటే ఇష్టమంది. తాజాగా మరోసారి ఇనిస్ట్రలో తన అభిమానులతో క్విచ్చిన్ అండ్ ఆన్సర్స్ సెషన్ నడిపింది. అందులో మరి కొన్ని ప్రశ్నలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె బోయ్ ప్రెండ్ అడిగిన ప్రశ్న మరీను.

ఓ అభిమాని శృతితో ..మీరు చెత్తగా చేసే వంటకం ఏది అని అడిగాడు. దానికి ఆమె బోయ్ ప్రెండ్ సమాధానం ఇచ్చాడు. టమోటా,ఉల్లిపాయి తొక్కు(పచ్చడి) ఆమె చేసే అత్యంత వరస్ట్ వంటంకంగా పేర్కొన్నాడు. సాధారణంగా ఆమె వంటకాలు బాగుంటాయి అని చెప్పాడు. డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో శ్రుతీహాసన్‌ ప్రేమలో ఉన్నారని కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  

అలాగే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో తనది మంచి పాత్ర అని శృతిహాసన్ అన్నారు. సలార్ మూవీ పాత్రకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చెప్పలేనని తెలిపారు.

మరి కొందరు నెటిజన్లు క్రాక్ సినిమాలో ఫైట్లు అద్భుతంగా  చేశారని సలార్ సినిమాలో కూడా అదే విధంగా ఫైట్లు చేస్తారా .? అని ప్రశ్నించగా సలార్ సినిమాలో తాను ఫైట్ సీన్లలో నటించడం లేదని శృతి పేర్కొన్నారు.ఒక నెటిజన్ శృతిహాసన్ యొక్క పర్సనల్ ఫోన్ నంబర్ గురించి అడగగా తాను నంబర్ ఇవ్వనని శృతి చెప్పుకొచ్చారు.
 
వేరొక నెటిజన్ ఏకంగా తనను పెళ్లి చేసుకోవాలని శృతిహాసన్ ను కోరగా తాను చేసుకోనని శృతిహాసన్ తెలిపారు.నెటిజన్లు చిరాకు తెప్పించే ప్రశ్నలు వేసినా శృతి మాత్రం అభిమానులు ఏ మాత్రం హర్ట్ కాకుండా హుందాగా బదులివ్వడం గమనార్హం.మరొక నెటిజన్ సిద్దార్థ్, శృతిహాసన్, హన్సిక నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమా గుర్తుందా అని ప్రశ్నించగా ఓ మై ఫ్రెండ్ తన ఫేవరెట్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారు.
 
మరొక నెటిజన్ మీరు వైజాగ్ కు ఎప్పుడు వస్తారు అని ప్రశ్నించగా వైజాగ్ తో తనకు అనుబంధం ఉందని తరచూ తాను వైజాగ్ కు వస్తూనే ఉంటానని శృతిహాసన్ వెల్లడించారు.శృతిహాసన్ నెటిజన్ల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios