శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ తో పాటు మరికొన్ని భారీ చిత్రాల్లో నటిస్తోంది. 

శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ తో పాటు మరికొన్ని భారీ చిత్రాల్లో నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. 

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. శృతి హాసన్ విచిత్రమైన డ్రెస్సుల్లో ట్రెండీగా ఉండడానికి ఇష్టపడుతుంది. తన ప్రియుడు శాంతనుతో క్లోజ్ గా ఉన్న పిక్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. 

అయితే చాలా మంది హీరోయిన్ల లాగే శృతి హాసన్ కూడా మద్యం సేవిస్తుందనే ప్రచారం ఉంది. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఓ నెటిజన్ మద్యానికి సంబందించిన ప్రశ్న అడిగారు. మీరు మద్యం తాగుతారా అని బోల్డ్ గా ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నకు శృతి హాసన్ ఖచ్చితమైన సమాధానం ఇచ్చింది. నేను మద్యం తాగను. డ్రగ్స్ కూడా తీసుకోను. ఆ అలవాట్లు నాకు లేవు. జీవితాన్ని హుందాగా గడపడం అంటేనే నాకు ఇష్టం అంటూ శృతి హాసన్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. వెస్ట్రన్ స్టయిల్ ఎంతలా ఫాలో అయినప్పటికీ శృతి హాసన్ కి మద్యం విషయంలో ఉన్న ఒపీనియన్ చూసి నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తున్నారు.