కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.
కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. ప్రస్తుతం శృతి హాసన్ సౌత్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు.
శృతి హాసన్ చేతిలో ప్రభాస్ సలార్, బాలయ్య NBK 107 లాంటి భారీ చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. శృతి హాసన్ కూడా తరచుగా ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. ఓ సినిమా విషయంలో శృతి హాసన్ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి ఆ విషయాన్ని రివీల్ చేసింది.
తాను నటించిన చిత్రాల్లో నాగ చైతన్య సరసన నటించిన ప్రేమమ్ చిత్రానికి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యానని శృతి పేర్కొంది. ఆ మూవీలో నా పాత్రని మలయాళం ప్రేమమ్ లో సాయి పల్లవితో పోల్చుతూ ట్రోల్ చేశారు. విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
వాస్తవానికి నేను ఆ చిత్రాన్ని చాలా అనుమానంగా అంగీకారం తెలిపా. ఆ సినిమాని ఓకె చేసినప్పటికీ సాయి పల్లవి లాగా చేయాలని, కాపీ కొట్టాలని అనుకోలేదు. నా స్టైల్ లో నేను చేశా. దీనితో సహజంగానే ఒరిజినల్ వర్షన్ తో పోల్చుతూ ట్రోల్ చేశారు అని శృతి పేర్కొంది. కానీ ఆ చిత్రం విజయం సాధించినట్లు శృతి హాసన్ తెలిపింది.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ టాలీవుడ్ లో తొలి బిగ్ హిట్ అందుకుంది. గత ఏడాది శృతి హాసన్ క్రాక్ మూవీతో తిరిగి ఫామ్ లోకి వచ్చింది. బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది.
