దక్షిణాది అగ్ర హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ నటిగా తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలకు దూరమైంది. సౌత్ లోఅవకాశాలు లేక బాలీవుడ్ లో ప్రయత్నం మొదలుపెట్టింది.

ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఇది ఇలా  ఉండగా.. ఇటీవల ఓ చిట్ చాట్ షోకి హాజరైన శ్రుతిహాసన్ ని హోస్ట్.. ''ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్తారని'' ప్రశ్నించాడు. 

దానికి శ్రుతి వెంటనే తమన్నా పేరు చెప్పింది. తమన్నా అంటే తనకు చాలా ఇష్టమని, ఒకవేళ తను అబ్బాయైతే.. తమన్నానే పెళ్లి చేసుకునే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తమన్నా మంచి అమ్మాయని కితాబిచ్చింది. తమన్నా, శ్రుతిహాసన్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి చూస్తూనే ఉన్నాం.

మరోసారి తమ మధ్య ఉన్న స్నేహాన్ని వెల్లడించే ప్రయత్నం చేసింది శ్రుతిహాసన్. ఇక తన తొలి సినిమా గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అన్నారు.