Asianet News TeluguAsianet News Telugu

‘సలార్‌’పై శృతి ఇంట్రస్టింగ్ కామెంట్స్, నిజంగానే అంతుందా?

ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండనుంది? ఆమె లుక్ ఎలా ఉండనుంది? అనే ఆసక్తి అందరిలోను ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమె 'ఆద్య' అనే పాత్రలో కనిపించనుందని చెబుతూ, ఆమె కి సంబంధించిన విషయాలు రివీల్ చేసిందామె.

Shruti Haasan said her role is crucial to Salaar story
Author
First Published Jan 29, 2023, 11:44 AM IST


ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’ (Salaar). హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ (Shruti Haasan) హీరోయిన్. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశ షూటింగ్ లో  ఉన్న ఈ సినిమా..గురించి శృతి హాసన్ తాజాగా కామెంట్స్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. శృతి హాసన్  ఈ సంక్రాంతికి రిలీజైన రెండు చిత్రాలు వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు చిత్రాలలోనూ హీరోయిన్ గా చేసింది. రెండు మంచి హిట్ అయ్యిన నేపధ్యంలో ఆమె చాలా ఉషారుగా ఉంది. దాంతో మీడియాతో మాట్లాడింది. తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చింది. అందులో సలార్ ప్రస్తావన వచ్చింది.

శృతిహాసన్ మాట్లాడుతూ.... సాలార్‌ భారీ ప్రాజెక్ట్‌ అని, అందులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని  తెలిపింది. ప్రశాంత్ నీల్ తన చిత్రాలకు ఎల్లప్పుడూ తీసుకువచ్చే అద్భుతమైన లేయర్స్ అన్నిటినీ ప్రేక్షకులు ఆశించగలరని, అలాగే కథకు తన పాత్ర చాలా కీలకమని ఆమె తెలిపింది. అయితే ఇదే విషయమై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.  గతంలో కూడా, చాలా మంది హీరోయిన్స్ ..ఇలాంటి  హీరో ఓరియెంటెండ్ చిత్రాలలో  కీలకమైన పాత్రలను చేస్తున్నామని అన్నారు, కానీ ఆ సినిమాలు చూసిన తర్వాత, ప్రేక్షకులు వారు కేవలం హీరోలకు ప్రక్కన పాటలు కోసం పెట్టారని గ్రహించారు. ప్రశాంత్ నీల్ కూడా ఎప్పుడూ  పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. అది ఉగ్రం లేదా KGF కావచ్చు. వాటిల్లో  ముఖ్యమైన పాత్రలు ఇవ్వలేదు. కాబట్టి శ్రుతి పాత్ర ఇంపాక్ట్  చూపుతుందా లేదా అనేది  చెప్పటం కష్టమే. మరి శ్రుతి చెప్పే మాటల్లో ఏమైనా నిజం ఉందా లేక ఆమెపై హైప్ పెంచడానికి ఇది మరో ఎత్తుగడలా అన్నది సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.

తాజా సమాచారం ప్రకారం శ్రుతిహాసన్ ఈ సినిమాలో ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. హీరో జీవితం గురించి శృతి హాసన్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందని తర్వాత అతనితో ప్రేమలో పడి అతనితో పాటు క్రైమ్స్ చేస్తూ ఉంటుందని సమాచారం. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి బాగా ప్రాధాన్యత ఉంటుందని ఈ సినిమాలో శృతి హసన్ కొన్ని యాక్షన్ సన్నివేశాలలో కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శృతిహాసన్ కి ఈ సినిమా మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

 శ్రుతిహాసన్ ఈ సినిమాలో ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. హీరో జీవితం గురించి శృతి హాసన్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందని తర్వాత అతనితో ప్రేమలో పడి అతనితో పాటు క్రైమ్స్ చేస్తూ ఉంటుందని సమాచారం. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి బాగా ప్రాధాన్యత ఉంటుందని ఈ సినిమాలో శృతి హసన్ కొన్ని యాక్షన్ సన్నివేశాలలో కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శృతిహాసన్ కి ఈ సినిమా మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. 
 
సలార్ మూవీగురించి మాట్లాడుతూ “స‌లార్‌లో చాలా మంచి రోల్ లో కనిపించనున్నా..అలాగే  సెట్లో ప్ర‌భాస్ స‌ర‌దాగా ఉంటారు. మేమిద్ద‌రం చాలా విష‌యాల గురించి మాట్లాడుకుంటుంటాం. ప్ర‌భాస్ అంత‌గా మాట్లాడ‌రు అని అంద‌రూ అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. ఆయ‌న చాలా బాగా మాట్లాడుతారు“ అని చెప్పుకొచ్చింది శృతిహాసన్. అలాగే కెరీర్లో స‌వాళ్ల‌ను ఎదుర్కొనడానికి  నేనెప్పుడూ ముందుంటాను. అందులోనూ ద‌ర్శ‌కులు నా ప్ర‌తిభ‌ను న‌మ్మి నాకు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌తిసారీ మ‌రింతగా ప్రూవ్ చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను అని తెలిపింది ఈ బ్యూటీ.

Follow Us:
Download App:
  • android
  • ios