Asianet News TeluguAsianet News Telugu

#Samantha భారీ ప్రాజెక్టు నుంచి సమంత ఔట్, శృతి హాసన్ ఇన్?!

 ఇదొక క్రాస్-కల్చరల్ రోమ్-కామ్ అని తెలుస్తోంది. ఇందులో 'బ్లైండ్ బై ది లైట్' ' లిఫ్ట్' ఫేమ్ వివేక్ కల్రాతో కలిసి నటించనుంది శృతి. 

Shruti Haasan Replaces Samantha Ruth Prabhu in #ChennaiStory jsp
Author
First Published Jan 25, 2024, 8:29 AM IST

రకరకాల కారణాలతో మొదట అనుకున్న స్టార్స్ ప్లేస్ లో వేరేవాళ్లు వచ్చి చేరుతూంటారు. అయితే అది అరుదుగా జరిగే విషయం. కాబట్టే అలాంటిది జరిగినప్పుడు వార్త అవుతుంది.  ఇప్పుడు సమంత ఓకే చేసి పట్టాలు ఎక్కించిన ప్రాజెక్టులోకి శృతి హాసన్ వచ్చి చేరినట్లుగా అఫీషియల్ గా ప్రకటన వచ్చింది.

వివరాల్లోకి వెళితే...  సమంత (Samantha)అనారోగ్య సమస్యలు ఉన్నా  ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ఇండియా వైడ్‌గా క్రేజ్ సంపాదించింది. అలాగే స్టార్‌డమ్‌కు నెక్ట్స్ లెవిల్ కు తీసుకెల్లింది  ‘పుష్ప’ చిత్రంలో చేసిన ఐటెం సాంగ్. మరో ప్రక్క  రాజ్ అండ్ డీకే హిందీలో రూపొందిస్తున్న ‘సిటడెల్’ (Citadel) వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది.  సినిమాల విషయానికి వస్తే... తెలుగులో సామ్ నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి చేస్తున్న ‘ఖుషి’ (Kushi) చిత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత  ఇంగ్లీష్ మూవీ చేసేందుకు సిద్ధమైంది సామ్. ‘చెన్నై స్టోరీ’ (Chennai Story) పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి ఇప్పుడు బయిటకు వచ్చేసింది. ఇదొక క్రాస్-కల్చరల్ రోమ్-కామ్ అని తెలుస్తోంది. 

బాఫ్తా అవార్డ్ విన్నర్ ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్న #ChennaiStory లో ముందుగా #Samantha ను హీరోయిన్ గా  ప్రకటించారు.  అయితే హెల్త్ ఇష్యూలతో  సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత స్థానంలో రీసెంట్ గా #Salaar తో సూపర్ హిట్ కొట్టిన #ShrutiHaasan ను ఖరారు చేసారు.ఇందులో 'బ్లైండ్ బై ది లైట్' ' లిఫ్ట్' ఫేమ్ వివేక్ కల్రాతో కలిసి నటించనుంది శృతి. టన్ కు చెందిన కెవిన్ హార్ట్, జాన్ రెనో, శామ్ వర్తింగ్టన్ లాంటి ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించనున్నారు. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ - UK గ్లోబల్ స్క్రీన్ ఫండ్ మద్దతుతో ఇండో-యుకె కో ప్రొడక్షన్ లో ఈ సినిమా రూపొందనుంది. 'ఓ బేబీ' నిర్మాత సునీత తాటికి చెందిన గురు ఫిల్మ్స్‌ సంస్థ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. నిమ్మి హరస్గామా రచనా సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్.. చెన్నై, కార్డఫ్ నగరాల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 ఇక ఈ సినిమా కథను ఎన్ మురళి రాసిన పాపులర్ నవల ‘అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్’ ఆధారంగా రూపొందింస్తున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, వివేక్ కల్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తల్లి మరణంతో చెన్నైకి వచ్చిన ఒక యువకుడు.. ఒక మహిళా డిటెక్టివ్ సహాయంతో తండ్రిని వెతికేందుకు ప్రయత్నించడమే ఈ సినిమా కథ. 'చెన్నై స్టోరీ' సినిమాలో శృతిహాసన్ చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios