నటి శ్రుతిహాసన్ ఒకప్పుడు హీరోయిన్ గా అగ్ర హీరోలందరి సరసన నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలకు దూరమైంది.

తరచూ ప్రియుడు మైకేల్ కోర్సలేతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరాలకు చిక్కేది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ కారణంగానే శ్రుతి సినిమాలకు దూరమైందనే మాటలు వినిపించేవి. అయితే ఈ వార్తలను కొట్టిపారేసింది ఈ బ్యూటీ.

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని వెల్లడించింది. అయితే తాజాగా శ్రుతి తన ప్రియుడితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''నువ్వు నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటావు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యమైనది అదే'' అంటూ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని, పెళ్లి చేసుకుంటే చూడాలనుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.