'సలార్' మూవీ నాది కాదు, ఆ విషయంలో ఎలాంటి బాధ లేదు..శృతి హాసన్ భలే చెప్పిందిగా
రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ లో సలార్ మానియా పెరుగుతోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం సలార్. ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల విడుదలైన టీజర్ కి థండర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చుతూ ప్రశాంత్ నీల్ క్రేజీ ఎలివేషన్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా రిలీజ్ రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ లో సలార్ మానియా పెరుగుతోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కెజిఎఫ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో కనిపిచింది అంతే. మరి ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ శృతి హాసన్ కి ఎలాంటి పాత్ర క్రియేట్ చేసారు అనే ఉత్కంఠ నెలకొంది.
స్టార్ హీరో అభిమానులు ఎవరైనా అది తమ హీరో చిత్రం అనే చెప్పుకుంటారు. సలార్ చిత్రాన్ని కూడా ఫ్యాన్స్ అది ప్రభాస్ మూవీ అని చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ కి ప్రశ్న ఎదురైంది. సలార్ ప్రభాస్ మూవీ ప్రభాస్ మూవీ అని పదే పదే అంటుంటే బాధగా అనిపించిందా అని ప్రశ్నించారు.
దీనికి శృతి హాసన్ బదులిస్తూ.. అందులో బాధ పడాల్సిన విషయం ఏముంది .. సలార్ ప్రభాస్ మూవీనే. వాస్తవంగా మాట్లాడుకుంటే సలార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ చిత్రమే అవుతుంది. అందులో నేను భాగం అంతే. మనం రియాల్టీ అర్థం చేసుకుని మాట్లాడాలి అంటూ శృతి హాసన్ కామెంట్స్ చేసింది. శృతి హాసన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏది ఏమైనా ఈ క్రిస్టమస్ కి ప్రభాస్ డైనోసార్ తరహాలో విధ్వంసం చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సాలిడ్ బాక్సాఫీస్ హిట్ కొట్టలేదు. సలార్ ఆ దాహం తీరుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.