తమిళంలో రొమాంటిక్‌ హీరో అంటే శింబునే గుర్తొస్తాడు. `వల్లభ` చిత్రంలో ఆయన రొమాన్స్ కి సౌత్‌ మొత్తంగా మంచి ఆదరణ దక్కింది. `లిప్‌ లాక్‌` కిస్సులకు కూడా ఆయనకు మంచి క్రేజ్‌ ఉంది. తాజాగా ఆయనతో విశ్వనటుడు కమల్‌ హాసన్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఆయనతో ఫస్ట్ టైమ్‌ కలిసి నటించబోతుంది. 

ప్రస్తుతం శింబు `మహా`, `మానాడు` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత మిస్కిన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్‌ని ఎంపిక చేశారని తెలుస్తుంది. మిస్కిన్‌ దర్శకత్వంలో సినిమా అంటే అది టెక్నికల్‌గా చాలా బలంగా ఉంటుంది. హీరోయిన్ల పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. అందుకే ఈ సినిమాకి శృతి ఓకే చెప్పిందని అంటున్నారు. మరి ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఇదే నిజమైతే రొమాంటిక్‌ హీరో సరసన హాట్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శృతి రొమాన్స్ చేస్తే అభిమానులకు పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

గతేడాది రీఎంట్రీ ఇచ్చిన శృతి ప్రస్తుతం తెలుగులో `వకీల్‌ సాబ్‌`లో పవన్‌కి జోడిగా నటిస్తుంది. ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. దీంతోపాటు రవితేజ సరసన `క్రాక్‌`లో నటిస్తుంది. ఇందులో ఆమె ఓ బిడ్డకి తల్లిగా కనిపించనుంది. మరోవైపు తమిళంలో `లాభం` చిత్రంలో విజయ్‌ సేతుపతి సరసన నటిస్తుంది.