శృతి హాసన్ నటించిన అంతర్జాతీయ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’ చిత్రం ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2025 వరకు జరిగే 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ కానుంది. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది, ఇది ఆసక్తికరమైన కథాంశంతో ఉత్కంఠ రేపుతోంది. శృతి హాసన్ నటన, మహిళా నేతృత్వంలోని నిర్మాణ సంస్థ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యావరణ అనుకూల విధానాలతో చిత్రీకరణ జరపడం విశేషం.
Shruti Haasan : శ్రుతి హాసన్ ఇప్పుడో ఇంటర్నేషనల్ సినిమా చేసింది. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’తో ఆమె గ్లోబల్ ఆడియెన్స్‌కు పరిచయం కాబోతోన్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2025 వరకు జరిగే హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా జరగుతోంది.ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్‌గా ‘ది ఐ’ చిత్రం ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది. లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజైంది. ది ఐ ట్రైలర్ చూస్తే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ గా అని అర్దమవుతోంది. ది ఐ ట్యాగ్ లైన్ 'చావు అన్నదే సమాప్తి కాకపోతే ఏం జరుగుతుంది?' అని పెట్టారు. దాంతోనే ఈ సినిమాపై చాలా ఆసక్తి కలిగిస్తోంది.
అలాగే ఈ సినిమాలో శృతి హాసన్ చాలా బోల్డ్ గా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ని చూస్తే హ్యాపీగా బోయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్ లైఫ్ ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. అంతేకాదు ఎవరో తనని చూస్తున్నట్టు ఆమెకు అనిపిస్తుంది. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది.. దీని వెనుక ఉన్నది ఎవరు.. వాటికి కారణాలు ఏంటి తెలియాలంటే ది ఐ చూడాల్సిందే. ది ఐ సినిమాలో మార్క్ రౌలే శృతికి జోడీగా నటిస్తున్నాడు.

Shruti Haasan : శృతి హాసన్ మాట్లాడుతూ.. ‘సైకలాజికల్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి. మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తం మహిళల నేతృత్వంలోని ప్రొడక్షన్ హౌస్‌లో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడం విశేషం. చలనచిత్ర పరిశ్రమలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నా అభిరుచికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది’ అని అన్నారు.
డాఫ్నే ష్మోన్ మాట్లాడుతూ.. ‘ది ఐ సినిమాలోని పాత్ర శృతి హాసన్‌కు అద్భుతంగా అనిపిస్తుంది. ఎమోషన్స్, సంఘర్షణ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించే డయానా పాత్రలో శృతి హాసన్ చక్కగా నటించారు. శ్రుతి హాసన్ ఎంతో పొటెన్షియల్ ఉన్న నటి. ఈ పాత్రకు ఆమె న్యాయం చేశారు. ఆమె అద్భుతమైన నటన ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంద’ని అన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కల్గించకుండా ఈ మూవీని షూట్ చేశారు. ప్రకృతిని హాని కల్గించకుండా సినిమాలు చేయడంలో భవిష్యత్ ప్రాజెక్ట్‌లకు ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది
