Asianet News TeluguAsianet News Telugu

'వాల్తేరు వీరయ్య'కి హ్యాండిచ్చి బాలయ్య షోకి శ్రుతి హాసన్... తేడా కామెంట్స్

 చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంట్రస్టింగ్  విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.  

ShruthiHassan attended shoot of #UnstoppableWithNBK
Author
First Published Jan 10, 2023, 7:03 AM IST

ఈ  సంక్రాంతికి ఇద్దరు సీనియర్  హీరోల పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.   చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంట్రస్టింగ్  విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.   తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది.

  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శృతిహాసన్ డుమ్మా కొట్టడమే ఈ రచ్చకు కారణమైంది.   తనకు ఆరోగ్యం బాగోలేక పోవడం వల్ల విశాఖపట్నం రాలేకపోయానని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే ఆమె గురించి ప్రస్తావిస్తూ ఆమెను ఎవరు బెదిరించారో తెలియదు కానీ రాలేకపోయింది అంటూ చిరంజీవి స్టేజిపై నవ్వుతూనే సెటైర్లు వేశారు. అంతకు రెండు రోజులు ముందే నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి ఈవెంట్ కు శృతిహాసన్ హాజరు కావడంతో చిరంజీవి బాలకృష్ణ గురించి ఇలా కామెంట్ చేసి ఉంటారని అందరూ భావించారు.

అక్కడి వరకు బాగానే ఉంది కానీ నిన్న జ్వరం వచ్చి హోటల్ రూమ్ కి పరిమితం అయ్యానని చెప్పుకొచ్చిన ఆమె ఈరోజు హైదరాబాదులో జరిగిన అన్ స్టాపబుల్ వీర సింహారెడ్డి స్పెషల్ ప్రమోషనల్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొవటంతో మెగా ఫ్యాన్స్ కుదొరికిపోయినట్లైంది. ఈ నెల 13 విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని అన్ స్టాపబుల్ టీమ్ ప్లాన్ చేసింది హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ స్టూడియోలో జరిగిన ఈ షూటింగ్ లో గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ వంటి వారితో కలిసి ఆమె అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.

ఆమె ఇలా #UnstoppableWithNBK తో సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు ఆమె మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ షో షూటింగ్ కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి ఏమి ఇబ్బంది అంటూ ఆమె మీద సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఈ అంశం మీద శృతిహాసన్ ఎలా స్పందిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios