ఒకప్పుడు దక్షిణాది అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన శృతిహాసన్ ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తన విదేశీ బాయ్ ఫ్రెండ్ తో కొంతకాలం డేటింగ్ చేసిన ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకొంది. దీంతో ఇక ఆమె సినిమాలు చేయదేమో అనుకున్నారు. 

అయితే సడెన్ గా తన లవ్ బ్రేకప్ అవ్వడంతో ఇప్పుడు కెరీర్ పై దృష్టి సారించింది. తిరిగి నటిగా బిజీ అవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలో  టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఆమెను ఓ సినిమా కోసం సంప్రదించాడు. రవితేజ హీరోగా సినిమా అనుకున్నాడు గోపీచంద్ మలినేని.

గతంలో రవితేజ, శృతిహాసన్ ల కాంబినేషన్ లో ఆయన 'బలుపు' అనే సినిమా తీశాడు. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని భావించాడు. ఈ మేరకు శృతిహాసన్ ని సంప్రదించగా.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి షాక్ ఇచ్చింది. దాదాపు కోటిన్నర రూపాయలను పారితోషికంగా ఇవ్వాలని అడిగిందట.

ప్రస్తుతం రవితేజకి మార్కెట్ లో డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీంతో వీలైనంత తక్కువ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారు.అలాంటిది హీరోయిన్ కి కోటిన్నర ఇచ్చే ఛాన్సే లేదు. దీంతో మరో ఆప్షన్ కోసం చూస్తున్నారట. రవితేజకి క్రేజ్ తగ్గడంతో అతడి సరసన నటిస్తే తన ఇమేజ్ తగ్గున్తుందేమోనని శృతిహసన్ ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ సమాచారం.