హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ తదుపరి చిత్రం హీరోయిన్ గా శృతీ హాసన్ ను సంప్రదించిన చిత్ర యూనిట్ త్వరలో డేట్స్ కన్ఫమ్ చేస్తానన్న శృతీ హాసన్

‘అఆ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు నితిన్. ఆయన. ఇప్పుడు నితిన్ మార్కెట్‌ కూడా విస్తృతమైంది. అందుకు తగ్గట్టుగానే తన తదుపరి చిత్రం ఉండాలని నితిన్ ఆచితూచి అడుగులేశాడు. చాలా కథలు విన్నాక.. . ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటించాలని నిర్ణయించుకొన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో నితిన్‌ సరసన శ్రుతిహాసన్‌ నటించనుందని సమాచారం.

చిత్రబృందం పలువురు కథానాయికల పేర్లని పరిశీలించాక శ్రుతిహాసన్‌ అయితే బాగుంటుందనే నిర్ణయానికొచ్చిందట. ప్రస్తుతం శృతి తండ్రి కమల్ తో కలిసి ‘శభాష్ నాయుడు’, పవన్ తో ‘కాటమరాయుడు’, సూర్యతో ‘సింగం 3’ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు హిందీలో సైతం ఓ సినిమా చేస్తుంది. అందుకే శృతి నితిన్ సినిమా పట్ల సుముఖంగానే ఉన్నప్పటికీ డేట్స్ చూసి ఫైనల్ డెసిషన్ చెప్తానని చెప్పిందట.